హైదరాబాద్ నగరవాసులు ఎప్పుడెప్పుడా అంటూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన క్షణాలు ఈ నవంబర్ లో ముగిసిపోనున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభం కానున్న సంగతి అందరికీ తెలసిందే. అయితే మెట్రో రైలు రాకతో అటు అర్టీసీ, ఇటు ఎంఎంటీఎస్ రైళ్లుకు ఎలాంటి భారం పడకుండా చేయాలన్న ప్రభుత్వ ఉద్దేశం. దీనికి తోడు నగరవాసికి నగరంలో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికైనా.. ఎందులోంచి (మెట్రో, ఎంఎంటీఎస్, అర్టీసీ) ఎందులోనైనా ప్రయాణించే సౌకర్యం కల్పించాలని కూడా అధికారులు యోచిస్తున్నారు.
ఇలా చేస్తే నగరవాసులకు అందుబాటులో వున్న అన్ని రవాణా సదుపాయాలను అనుసంధానించినట్లు అవుతుందని, దీంతో నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కూడా జరుగుతుందని, ఫలితంగా నగరం కాలుష్య నివారణ చర్యలకు కూడా అడుగుముందుకు పడినట్లు అవుతుందన భావించిన ప్రభుత్వం హైదరాబాద్ వాసులకు శుభవార్తను అందించింది. మెట్రో రైలు ప్రారంభమైన తరువాత ఈ మూడు రవాణా వ్యవస్థలను అనుసంధానం చేసేందుకు చర్యలను తీసుకుంది.
ఇందుకోసం ఏ వ్యవస్థలో ప్రయాణం చేసినా మాటిమాటికీ టిక్కెట్ తీసుకునే అవసరం లేకుండా కామన్ టిక్కెట్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు స్మార్ట్ కార్డ్ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకు రావాలని సీఎస్, హైదరాబాద్ మెట్రో రైల్ బోర్డు చైర్మన్ ఎస్పీ సింగ్ ఆదేశించారు. మెట్రో స్టేషన్ల వద్ద ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. ముఖ్యంగా మూత్రశాలలు, బస్ బేలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మియాపూర్-అమీర్పేట్ మార్గంలో మెట్రోను ప్రారంభించేందుకు అవసరమైన అనుమతులను నవంబర్ మొదటి వారంలోగా తీసుకోవాలని ఎస్పీ సింగ్ సూచించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more