Kejriwal invites Kamal to joint active politics కమలదళానికి వ్యతిరేకంగా కేజ్రీ-కమల్ భేటీ

Arvind kejriwal invites kamal hassan to joint active politics

arvind kejriwal, kamal haasan, akshara haasan, chennai airport, delhi cm, kejriwal kamal haasan meet, chennai, tami nadu

HomeIndia news Arvind Kejriwal, Kamal Haasan meet: Superstar’s actress daughter Akshara Haasan receives Delhi CM at Chennai airport Arvind Kejriwal, Kamal Haasan meet: Superstar’s actress daughter Akshara Haasan receives Delhi CM at Chennai airport Arvind Kejriwal, Kamal Haasan meet: The Delhi CM is meeting Haasan today and on his arrival at Chennai airport the matinee idol's daughter Akshara Haasan received him

కమలదళానికి వ్యతిరేకంగా కేజ్రీ-కమల్ భేటీ

Posted: 09/21/2017 07:53 PM IST
Arvind kejriwal invites kamal hassan to joint active politics

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాను రాజకీయాల్లోకి రానున్నానని చెప్పిన విలక్షణ హీరో కమలహాసన్ తో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యేకంగా భేటీయై తాజా రాజకీయ అవకాశాలపై చర్చించనున్నారు. ఇప్పటి వరకు ఉత్తరభారతావనికే పరిమితమైన అప్ పార్టీని కేజ్రీవాల్ దక్షిణాధికి కూడా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారా..? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. ఎవరూ ఊహించని విధంగా కమలహాసన్ తో ఆయన భేటీ అవ్వటం రాజకీయ వర్గాల్లో పెను కలకలం రేపింది.

ఢిల్లీ నుంచి చెన్నై ఎయిర్ పోర్ట్ లో దిగిన సీఎం కేజ్రీవాల్ కు కమల్ చిన్న తనయ అక్షర స్వాగతం పలికింది. కమలహాసన్ ఇంట్లో భేటీ అయిన వీళ్లిద్దరూ గంట సేపు చర్చించారు. ఆ తర్వాత సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. గతంలో మా కుటుంబంలో కొందరు రాజకీయాల్లో ఉన్నారు. నేను మాత్రమే వాటికి దూరంగా ఉన్నాను. ఇప్పుడు రాజకీయాల గురించి నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ జీవితం ప్రారంభించే ముందు కేజ్రీవాల్‌ నుంచి సలహాలు తీసుకున్నాను అని చెప్పారు. మా ఇద్దరి ఆలోచనలు, లక్ష్యాలు ఒకటేనన్నారు కమల్.

అవినీతిపై పోరాటమే మమ్మల్ని కలిపిందన్నారు. ఇద్దరి ఆలోచనలు ఒకటే అన్నారు. కమల్‌ ఎంతో మంచి వ్యక్తి అని, ఆయన తప్పకుండా రాజకీయాల్లోకి రావాలన్నారు. ఇక ముందు కూడా కలుస్తూనే ఉంటామని తెలిపారు. ఇప్పుడు మర్యాదపూర్వకంగానే భేటీ జరిగిందన్నారు. కమల్ ఆమ్ ఆద్మీ పార్టీలోకి వస్తాడా.. లేడా అన్న విషయాన్ని మాత్రం దాటవేశారు కేజ్రీవాల్. మరిన్ని భేటీలు, సమావేశాల తర్వాత వీటిపై క్లారిటీ వస్తుందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles