no restriction on debit cards says IRCTC డెబిట్ కార్డుల చెల్లవన్న వార్తలను ఖండించిన రైల్వేశాఖ

Irctc denies reports of some banks cards barred for payment

irctc, irctc ticket booking, irctc train booking, irctc.co.in, indian railway ticket, railways ticket, book railways ticket, irctc online payment, irctc bank payment, indian overseas bank, canara bank, united bank of india, indian bank, central bank of india, hdfc bank, axis bank, book train ticket online, book railway ticket

Amidst reports of IRCTC barring certain banks from using its payment gateway for debit card transactions, the railways' tourism and catering arm issued a statement denying the reports.

ఆ డెబిట్ కార్డుల చెల్లవన్న వార్తలను ఖండించిన రైల్వేశాఖ

Posted: 09/23/2017 10:50 AM IST
Irctc denies reports of some banks cards barred for payment

డెబిట్‌ కార్డుల ద్వారా ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్ల బుకింగ్‌ను కఠినతరం చేయడంతో పాటు పలు బ్యాంకులను డెబిట్‌ కార్డ్‌ పేమెంట్‌ గేట్‌వే నుంచి తొలగించిందన్న వార్తలను ఐఆర్సీటీసీ ఖండించింది. ఈ మేరకు ఓ ప్రకటనను వెలువరించిన ఐఆర్సీటీసీ తాము పేమెంట్స్ గేట్ వే నుంచి ఏ బ్యాంకు డెబిట్ కార్డులను తొలిగించలేదని పేర్కొంది. ఐఆర్సీటీసీ పేమేంట్స్ గేట్ వే లావాదేవీలు జరుపుకునే ప్ర్రక్రియ అన్ని బ్యాంకులకు అందుబాటులో వుందని, వీటి నుంచి ఏ బ్యాంకుకు చెందిన కార్డులను నిలువరించలేదని స్పష్టం చేసింది.

భారతీయ బ్యాంకులు జారీ చేసిన అన్ని మాస్టార్, వీసా కలిగిన డెబిట్, క్రెడిట్ కార్డులన్నీ తమ వెబ్ సైట్ ద్వారా లావాదేవీలు జరుపుకునేందుకు సౌలభ్యం వుందని చెప్పారు. తమ ఐఆర్సీటీసీలోని ఏడు గేట్ వేలు అన్ని బ్యాంకులు కార్డులు లావాదేవీలు జరుపుకోవచ్చునని చెప్పారు. అయితే ఐఆర్సీటీసీపై పడుతున్న అదనపు భారం నేపథ్యంలో ఈ బ్యాంకులను కేవలం లావాదేవీల చార్జీలను షేర్ చేసుకోవాల్సిందిగా మాత్రమే తాము కోరామని వెల్లడింది.

అయితే ఐఆర్సీటీసీ పలు బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలను జరుపుకునే అవకాశాన్ని తొలగించిందని.. అ బాబితాలో ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ, ప్రైవేట్‌ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకులతో పాటు ఇతరత్రా పలు బ్యాంకులున్నాయని.. ఆయా బ్యాంకులు కస్టమర్ల దగ్గర్నుంచి వసూలు చేసే కన్వీనియన్స్‌ ఫీజులో IRCTCకి వాటా ఇచ్చేందుకు నిరాకరించడమే ఇందుకు కారణమని వచ్చిన వార్తలలో ఏ మాత్రం నిజం లేదని ఐఆర్సీటీసీ స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles