దేశంలో జర్నలిస్టులకు భద్రత కరువైంది. మరీ ముఖ్యంగా బీజేపీయేతర పార్టీలు పాలన సాగిస్తున్న రాష్ట్రాల్లోనే ఈ దారుణాలు జరగడం చర్చనీయాంశంగా మారుతుంది. ప్రముఖ రచయితలు, జర్నటిస్టులను టార్గెట్ చేసుకుని జరుగతున్న ఈ హత్యలు కలం వీరుల ప్రపంచంలో్ ప్రకంపనటు సృష్టిస్తున్నాయి. కత్తి కన్నా కలం గోప్పదన్న సూక్తి తెలిసి కూడా జర్నలిస్టులపై హత్యలకు తెగబడుతూ.. వారికి స్వేఛ్చా ప్రపంచాన్ని దూరం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి.
ఇటీవల బెంగళూరులో సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేశ్ దారుణ హత్య సృష్టించిన ప్రకంపనలు ఇంకా చల్లారకముందే చండీగఢ్ లో మరో సీనియర్ జర్నలిస్టు కేజె సింగ్ ను అతని తల్లిని దారుణంగా హత్య చేశారు. పంజాబ్ మొహాలీలోని నివాసంలో ఆయన అనుమానాస్పద స్థితిలో మరణించారు. కొడుకు హత్యను అడ్డుకోబోయిన కేజే సింగ్ తల్లి గురుచరణ్ కౌర్ (92) కూడా ప్రాణాలు కోల్పోవడం మరింత విషాదాన్ని రేపింది.
గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జంట హత్యలపై పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అటు సీనియర్ పోలీసు అధికారులు కేజె సింగ్ నివాసానికి చేరుకుని ఘటనాస్థలిని పరిశీలిస్తున్నారు. మొహాలీ సూపరింటెండెంట్ కుల్దీప్ చాహల్ అందించిన సమాచారం ప్రకారం.. తలుపు తట్టిన శబ్దం విని తెరిచిన సింగ్ కడుపులో తొలి కత్తిపోటు దించారని, ఆ తరువాత అతన్ని లోనికి నెట్టేసి గొంతును కూడా కోసారని తెలిపారు. మంచంపై పడివున్న అతని తల్లిని కూడా అగంతకులు హత్యచేశారని తెలిపారు.
కాగా ఈ జంట హత్యలను దొంగతనం నేపథ్యంలో జరిగిన హత్యలుగా చిత్రీకరించేందుకు కూడా ప్రయత్నం సాగుతుందని వారు అనుమానాలు వ్యక్తం చేశారు. హత్య జరిగిన తరువాత కేజే సింగ్ ఫోర్డ్ ఐకాన్ కారును, ఆయన ఇంట్లోంచి ఎల్ఈఢీ టీవీని హంతకులు అపహరించారని కూడా చెప్పారు. కేజీ సింగ్ యశ్ పాల్ కౌర్ ఇవాల మధ్యహ్నం తన మామయ్యకు అమ్మలకు బోజనం తీసుకుని రాగా ఇంటి తలుపు గడియకు బయటి నుంచి పెట్టివుండటం.. రక్తం మరకలు అంటివుండటాన్ని చూసి పోలీసులకు పిర్యాదు చేయడంతో ఈ హత్యలు వెలుగులోకి వచ్చాయి.
చండీగడ్ లో జర్నలిస్టుగా కేజె సింగ్‌కు మంచి పేరుంది. ముఖ్యంగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు న్యూస్ ఎడిటర్‌గా, టైమ్స్ ఆఫ్ ఇండియా, ది ట్రిబ్యూన్ లాంటి పత్రికల్లో ఉన్నత స్థానాల్లో ఆయన పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఓ కెనడియన్ పత్రికకు సేవలు అందిస్తున్నారు. కేజే సింగ్ హత్య నేపథ్యంలో ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర డీజీపీతో ఫోన్ ద్వారా మాట్లాడిన ఆయన ఈ కేసులో నిందితులు ఎంతటి వారైనా వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అదేశించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more