దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రింకోర్టుకే ఒక్కోసారి కొన్ని సమస్యలను పరిష్కారం చెప్పడం సాధ్యం కాదు. అలాంటప్పుడే న్యాయస్థానం ఈ కేసుల్లో తీర్పులు చెప్పడానికి తాము దేవుళ్లం కాదు అని కూడా అనేస్తారు. అదేంటి అలాంటి కేసులు కూడా వస్తాయా..? అంటే నిజంగా వస్తాయి. ఇలా వచ్చిన ఓ కేసు విషయంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దిసభ్య ధర్మాసనం తీర్పు చెప్పడానికి సాధ్యపడని చెప్పింది.
ధనేష్ లెస్దాన్ అనే న్యాయవాది ఈ పిటీషన్ దాఖలు చేశారు. దానిని జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ దీపక్ గుప్త ధర్మాసనం విచారించింది. దోమలను సమూలంగా అంతం చేయాలనేది ఆ పిటిషన్ సారాంశం. డెంగ్యూ, చికున్ గున్యా, జికా వంటి వ్యాధులు వ్యాపింపజేసి ఎంతో మంది మరణాలకు కారణమవుతున్న దోమలను పూర్తిగా నాశనం చేసేలా చర్యలు తీసుకోమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ ధనేష్ లెశ్ధాన్ అనే వ్యక్తి పిటిషన్ వేశాడు.
అయితే అలా చేయడం తమ పరిధిలోకి రాదని, ఈ పని కేవలం దేవుడు మాత్రమే చేయగలడని ధర్మాసనం తీర్పునిచ్చింది. తాము దేవుళ్లం కాదని, ఇలాంటి పనులు చేయాలని మరోసారి అడగొద్దని సుప్రీం కోర్టు సూచించింది. అయితే ఇదే న్యాయవాది గత రెండేళ్ల క్రితం అంటే 2015లో కూడా దోమల వల్ల వ్యాపించే డెంగ్యూ సహా పలు రోగాలను నిరోధించాలని కోరుతూ ఓ పిటీషన్ ను దాఖలు చేయగా, దానిని కూడా సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. అయితే న్యాయవాది మాత్రం దోమల నివారణ చర్యలను తీసుకోవాల్సిందగా కోర్టు ప్రభుత్వాలను అదేశించాలని కోరారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more