ప్రేమించిన వాడు చెప్పిన చేయకూడని పని చేసిన ఆ ప్రియురాలు అడ్డంగా పట్టుబడింది. విషయాన్ని ప్రియుడికి తెలిపింది. దీంతో తమను పోలీసులు బుక్ చేస్తారని, భయపడిన ప్రేమజంట.. భయంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన మహారాష్ట్రలో కలకలం రేపింది. గత వారం రైల్వే పట్టాలపై విగత జవుల్లా పడివున్న వీరి అత్మహత్య వెనుక గత కారణాలను తెలుసుకున్న పోలీసులు నివ్వెరపోయే విషయాలను తెలుసుకున్నారు. థానే జిల్లా కల్యాణ్ పట్టణంలో జరిగిన ఘటన ఇలాంటి పనులకు ఎవరూ పునుకోవద్దన్న సందేశాన్ని కూడా నేటి యువతకు అందిస్తుంది.
ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. హాస్టల్ లో ఉంటూ, సెయింట్ జార్జ్ ఆసుపత్రిలో నర్సుగా శిక్షణ పొందుతున్న 21 సంవత్సరాల వృశాలి లండే.. స్థానికంగా ఓ ప్రైవేటు అస్పత్రిలో మేల్ నర్సుగా పని చేస్తున్న సురేశ్ తో ప్రేమలో ఉంది. అతని కోరిక మేరకు హాస్టల్ రూమ్ మేట్స్ నగ్న చిత్రాలను తీసి సురేశ్ కు పంపి పెద్ద తప్పే చేసింది. సురేష్ తో జరిగిన చాటింగ్ లో ఈ విషయాన్ని వృశాలి రూమ్ మేట్స్ తెలుసుకున్నారు. దీంతో అమె అడ్డంగా బుక్కయ్యింది. దీంతో వారు వృశాలితో ఈ మేరకు ఓ నోట్ రాయించుకున్నారు.
అయితే తమ నగ్న చిత్రాలను సురేష్ ఏం చేశాడన్న సంగతి తెలియని వృశాలి స్నేహితులు.. తమ చిత్రాలు ఎక్కడ బయటపడినా దానికి వారే బాధ్యులని కూడా రాయించుకున్నారు. సురేశ్ బలవంతం చేయడంతో తాను ఈ తప్పుడు పని చేశానని కూడా రాయించుకున్నారు. ఇకపై వృశాలిని సురేష్ షిండేతో కలవకూడదని కూడా హెచ్చరించారు. లేనిపక్షంలో తాము ఈ కాయితాన్ని పోలీసులకు అందజేసి పిర్యాదు చేస్తామని చెప్పడంతో భయపడిన వృశాలి.. కొన్ని రోజుల పాటు సురేష్ ను కలవకుండా జాగ్రత్త పడింది.
అయినా, సురేష్ తో వృశాలి బంధం తెగలేదు. ఇదే విషయమై స్నేహితురాళ్లతో 23న గొడవ కూడా పడింది. ఆపై హాస్టల్ వదిలి వెళ్లిన వృశాలి, సురేష్ కు విషయం చెప్పింది. తన ఫ్రెండ్స్ ఎక్కడ పోలీసు కేసు పెడతారోనన్న భయంతో వీరిద్దరూ సమీపంలోని రైలు పట్టాలపైకి వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. హాస్టల్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వృశాలి గది నుంచి ఆత్మహత్యకు దారితీసిన కారణాల లేఖను స్వాధీనం చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు. స్మార్ట్ ఫోన్లు అవసరానికి ఎంత బాగా వినియోగిస్తే అంత మంచిది.. కానీ అనవసర విషయాలకు వినియోగిస్తే ఇలాంటి దారుణాలకే దారితీస్తాయని ఈ ఘటన మరోమారు రుజువు చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more