15 killed, 20 injured in stampede at Mumbai overbridge పండగ వేళ విషాదం.. తొక్కిసలాలో 15మంది మృతి

15 killed 20 injured in stampede at mumbai s elphinstone railway station footover bridge

Stampede at Elphinstone railway station, Elphinstone railway station, elphinstone stampede, Mumbai station stampede, Mumbai rains, Mumbai railways, Mumbai Railway Station, Stampede, Elphinstone railway station, foot over bridge, Mumbai, Railways, rains, crime

Fifteen people are dead and at least 30 seriously injured in a stampede that broke out at a narrow foot over-bridge near a local train station in Mumbai after heavy rain this morning.

పండగ వేళ మహావిషాదం.. తొక్కిసలాట

Posted: 09/29/2017 12:01 PM IST
15 killed 20 injured in stampede at mumbai s elphinstone railway station footover bridge

దేశ అర్ధిక రాజధాని ముంబయిలో తీవ్ర విషాదం అలుముకుంది. దసరా పర్వదినం వేళ.. 15 మంది నిండు ప్రాణాలను వరుణుడు బలితీసుకున్నాడు. ఆయుధ పూజలు జరుగుతున్న క్రమంలో తమ కార్యాలయాల్లో పూజలకు విధిగా హాజరయ్యేందుకు వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ప్రయాణికులు రైల్వే స్టేషన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జిపైకి పరుగులు తీయడంతో తొక్కిసలాట చోటు చేసుకోవడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని జీఆర్పీ కమీషనర్ నికెట్ కౌశిక్ తెలిపారు.

స్థానిక ఎల్ఫిన్‌స్టోన్ రైల్వేస్టేషన్ వద్ద చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో దాదాపుగా 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అయితే వారిలో ఇరవై మంది పరిస్థితి విషమంగా వుందని తెలిసింది. నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడే ఈ రైల్వేస్టేషన్ కు ఇవాళ పెద్ద సంఖ్యలో ప్రయాణికులు చేరుకున్నారు. ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో వున్న తమ కార్యాలయాల్లో పూజలను నిర్వహించుకునేందుకు ఉదయాన్నే రైల్వే స్టేషన్ కు ప్రయాణికులు చేరుకున్నారు. సబర్బన్ రైల్వే నెట్ వర్క్ తో అనుసంధానించడంతో ఈ స్టేషన్ లో ప్రయాణికుల సంఖ్య నిత్యం అధికమే.

అయితే ఒక్కసారిగా భారీగా పడిన వర్షం నుంచి తమను తాము రక్షించుకునేందుకు ప్రయాణికులు ఎల్ఫిన్ స్టోన్ రైల్వేస్టేషన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి కిందకు పరుగులు తీశారు. ఒక్కసారిగా ప్రయాణికులంతా ఆ వంతెనపైకి దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఉదయం సరిగ్గా రద్దీగా వుంటే పదిన్నర గంటల సమయంలో ఈ ఘటన సంభవించిందని స్థానికులు చెప్పారు. తొక్కిసలాట నుంచి తప్పించుకునేందుకు కొందరు వంతెన కడ్డీలు పట్టుకుని కిందకు పరుగులు తీశారు. సమాచారమందుకున్న పోలీసులు, వైద్య సిబ్బంది రైల్వేస్టేషన్‌కు చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులకు వైద్యసాయం అందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Stampede  Elphinstone railway station  foot over bridge  Mumbai  Railways  rains  crime  

Other Articles