ఢిల్లీకి వెళ్లాము రామా హరి.. అయినా పట్టుకున్నారండీ రామాహరి.. దేశరాజధాని చూద్దమనుకున్నాము రామాహరి.. కానీ విద్యార్ధిని తీసుకోచ్చారు రామాహరి.. ఇది వింటుంటే కాశీకి పోయాము రామహరి అన్న పాట గుర్తుకు వస్తుంది కదూ. నిజమే.. దొంగవేషాలు, మోసాలు చేసేవారు ఎన్ని కపట మాటలు చెప్పినా.. ఆ వెనువెంటనే నిజాలను పక్కనుంచి చెప్పేనట్లుగానే ఇక్కడ కూడా దేశ రాజధాని ఢిల్లీకి ఓ 9వ తరగతి విద్యార్థిని వారింట్లో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా టీచర్ తన సోంత డబ్బులతో తీసుకెళ్లడంలో అంతర్యమేమిటో మాత్రం అర్థకాలేదు.
కానీ నిజంగా తాము ఢిల్లీ చూడటానికే వచ్చామని, ఇంట్లో చెబితే పంపించరని సమాచారం ఇవ్వలేదని టీచర్ తో పాటు విద్యార్థి కూడా అదే విషయాన్ని పోలీసు విచారణలో తెలిపారు. అలాంటప్పుడు విద్యార్థికి ఖర్చుచేసే డబ్బును తన స్నేహితులపై వెచ్చింది వారిని దేశరాజధానికి తీసుకెళ్లవచ్చుకదా..? లేదా అదే పాఠశాలలోని మరో టీచర్ ను తీసుకుని వెళ్లకుండా విద్యార్థిని మాత్రమే తీసుకెళ్లడంలో లోగ్గుట్టును తెలుసుకునేందుకు పోలీసులు విచారణ చేస్తున్నారు. బోపాల్ పోలీసులకు చిక్కిన వీరిని హైదరాబాద్ కు తరలిస్తున్నారు. అసలేం జరిగిందంటే..
కర్నూలులోని పాతబస్తీలో నివాసం ఉండే బాలుడు ఇంటికి దగ్గర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. అదే స్కూల్ లో పని చేస్తున్న 28 యువతితో కలిసి ఈ నెల 3న తెల్లవారు జామున వెళ్లిపోయాడు. పిల్లాడి ఎక్కడికెళ్లాడో తెలియని తల్లిదండ్రులు అతని కోసం రోజంతా ఎదురు చూసి.. చివరకు కర్నూలు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ పుటేజ్ అధారంగా విద్యార్ధి మహిళా టీచర్ తో కలిసి వెళ్లినట్టు గుర్తించిన పోలీసులు.. ఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్ ప్రెస్ ఎక్కినట్టు గుర్తించారు. దీంతో భోపాల్ పోలీసులను సంప్రదించి, వారిని అక్కడ అదుపులోకి తీసుకున్నారు. దీంతో వారిద్దరి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భోపాల్ వెళ్లి వారిని తీసుకొచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more