npcil notification for stipendiary trainees technician recruitment న్యూక్లియర్ పవర్ కార్పోరేషన్ లో ఉద్యోగాలు..

Npcil notification for stipendiary trainees technician recruitment

latest jobs news, NPCIL, technician recruitment, Recruitment in NPCIL, Stipendiary Trainees, Technician recruitment 2017, NPCIL Jobs, NPCIL, Jobs

NPCIL has invited application for 79 Vacancies for Trade Apprentices, and candidates with ITI certificate in the concerned trade may apply by 3 October 2017.

న్యూక్లియర్ పవర్ కార్పోరేషన్ లో ఉద్యోగాలు..

Posted: 10/07/2017 10:59 AM IST
Npcil notification for stipendiary trainees technician recruitment

న్యూక్లియన్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) ఇంజనీరింగ్, ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థుల నుంచి సైంటిఫిక్ అసిస్టెంట్, ట్రెయినీ టెక్నీషియన్ పోస్టులను ఉద్యోగాలకు ధరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన ఈ సంస్థలో నేరుగా ఉద్యోగాల కల్పన కాకుండా తొలుత శిక్షణను అందిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల పాటు శిక్షణను అందిస్తారు. ఈ శిక్షణాకాలంలో స్టయిపెండ్ చెల్లిస్తారు. శిక్షణాకాలం పూరైయిన తరువాత ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ 22,000 వేలు నుంచి 45 వేల వరకు వేతనం చెల్లిస్తారు. సైంటిఫిక్ అసిస్టెంట్‌కు ఏడాదిన్నర, టెక్నీషియన్‌కు రెండేళ్ల శిక్షణ ఉంటుంది.

స్టయిపెండరీ ట్రెయినీ (సైంటిఫిక్ అసిస్టెంట్): 6

విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్

విద్యార్హతలు: మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా ఉండాలి లేదా బీఎస్సీ డిగ్రీ ఉండాలి. పదోతరగతి లేదా ఇంటర్‌లో ఇంగ్లిష్‌ను చదివి ఉండాలి.

స్టయిపెండరీ ట్రెయినీ (టెక్నీషియన్): 50

విభాగాలు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఏసీ మెకానిక్, మాసన్, కార్పెంటర్, ప్లంబర్, టర్నర్, మిల్లర్.

విద్యార్హతలు: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సైన్స్, మ్యాథ్‌మెటిక్స్‌లో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. సంబంధిత ట్రేడ్‌లో రెండేళ్ల ఐటీఐ కోర్సు పూర్తిచేసి ఉండాలి. పదోతరగతిలో ఇంగ్లిష్ తప్పనిసరిగా చదివి ఉండాలి. ఏడాది ITI కోర్సుచేసిన అభ్యర్థులకు కనీసం ఏడాది వర్క్ ఎక్స్‌పీరియెన్స్ ఉండాలి.

దరఖాస్తు విధానం: NPCIL వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

వయోపరిమితులు : 2017 అక్టోబరు 25 నాటికి సైంటిఫిక్ అసిస్టెంట్‌కు 18 నుంచి 25, టెక్నీషియన్‌కు 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం SC,ST,OBC, దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. కనీసం ఎత్తు 160 సెం.మీ. ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్షను 100 మార్కులకు ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహిస్తారు. ఇందులో అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లిష్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులను మెరిట్ ప్రాతిపదికన ట్రేడ్ టెస్ట్/ ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: అక్టోబరు 25 మరిన్ని వివరాలకు http://npcilcareers.co.in/taps2017/documents/Advt.pdf వెబ్ సైట్ ను సంప్రదించండీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles