Rahul Gandhi mistakenly enters ladies' toilet లేడీస్ టాయ్ లెట్ లోకి వెళ్లిన రాహుల్‌!

Rahul gandhi accidentally enters ladies toilet in gujarat

Rahul Gandhi, Congress, Gujarat, Ladies toilet, Chhota Udepur, Town Hall, Media, Ladies, Laghter, PM Modi, one liners. politics

Rahul Gandhi is creating ripples all across Gujarat with his witty one-liners criticising the Modi-government. His campaign was free of his infamous gaffes- until today, when he accidentally entered a ladies' toilet in Chhota Udepur district.

రాహుల్ గాంధీ వెళ్లింది పురుషుల టాయ్ లెట్ కాదా..?

Posted: 10/12/2017 10:45 AM IST
Rahul gandhi accidentally enters ladies toilet in gujarat

మరో రెండు మూడు మాసాల్లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికల సమరశంఖాన్ని ఎన్నికల సంఘం పూరించనున్న నేపథ్యంలో.. ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర యువతను అకర్ఫిషించే పనిలో భాగంగా ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ యువనేత, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ.. ప్రధాని మోదీపై ప్రభుత్వం వైఫల్యాలపై తనదైన శైలిలో ఏకవ్యాఖ్య పంచ్ డైలాగులతో ఓవైపు రాజకీయ ప్రకంపనలకు కారణమవుతున్నాడు. ఇప్పటివరకు గుజరాత్‌లో ఆయన ప్రచారం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సజావుగా సాగింది.

అయితే క్రితం రోజు సాయంత్రం ఛోటా ఉడేపూర్ జిల్లాలో యువతతో సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించిన తరువాత బయటకు వచ్చిన ఆయన అనుకోకుండా చిన్న పొరపాటు చేయడంతో అది కాస్తా తాజాగా మీడియాలో వైరల్ అయ్యింది. అదేంటంటారా..? జిల్లాలోని టౌన్ హాల్ నుంచి బయటకు వస్తూ ఆయన వాష్ రూమ్ లోకి వెళ్లారు. అయితే అయన తెలియకుండా పోరబాటున లేడీస్‌ వాష్ రూంలోకి వెళ్లారు. అది ఎవరి టాయ్ లెట్ అని సూచిస్తూ అక్కడ బొమ్మలేమీ లేవు.. అదీకాక.. కనీసం హీందీలోనో, ఇంగ్లీషులోనే కూడా రాసి లేవు.

కేవలం గుజరాతీలో 'మహిళల టాయ్ లెట్' అని రాసి ఉంది. రాహుల్ కు గుజరాతీ చదవడం రాకపోవడంతో ఆయన మహిళల వాష్ రూంలోకి వెళ్లారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ విషయం తెలుసుకున్న మీడియా సిబ్బంది దానిని కవర్ చేసేందుకు అక్కడికి చేరుకోవడంతో రాహుల్ ఎస్పీజీ సిబ్బంది మీడియా ప్రతినిధులను చెదరగొట్టారు. అయినా, కొందరు మీడియా ప్రతినిధులు ఈ ఘటనను తమ కెమెరాలో బంధించారు. లేడీస్‌ టాయ్‌లెట్‌ నుంచి రాహుల్‌ బయటకు రాగానే.. అక్కడే ఉన్న స్థానికులు ఒక్కసారిగా నవ్వారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  Congress  Gujarat  Ladies toilet  Chhota Udepur  Town Hall  Media  Ladies  Laghter  PM Modi  one liners. politics  

Other Articles