Eggetarians today its your day to celebrate వరల్డ్ ఎగ్ డే: గుడ్డతో పుడ్డు సో బెటరూ..!

Eggetarians today its your day to celebrate

world egg day 2017, world egg day celebrations, world egg day 2017 theme, world egg day wikipedia, world egg day 2018, world egg day 2017 logo, world egg day 2017, world egg day 2017 theme, hyderbadis, Eggetarian, good symptoms, protiens, vegetarian, latest news

World Egg Day is a unique opportunity to help raise awareness of the benifits of eggs and is celebrated in countries all around the world. The initiative behind this is to promote the importance and benefits to include egg in your daliy diet.

వరల్డ్ ఎగ్ డే: గుడ్డుతో ఫుడ్డు సో బెటరూ..!

Posted: 10/13/2017 11:07 AM IST
Eggetarians today its your day to celebrate

సండే హోయా మండే..రోజ్ ఖావో అండే.. అంటూ యావత్ దేశప్రజలను కోడిగుడ్లు తినేలా ప్రేరేపించింది జాతీయ ఎగ్ కో ఆర్డినేషన్. ఈ ప్రకటనలతో గుడ్డుపై ప్రజలకు మక్కువను పెంచింది. దేశవ్యాప్తంగా రోజు రోజుకీ గుడ్డు తినేవారి సంఖ్య పెరిగిపోతుంది. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ మాదిరిగానే ఇప్పుడు తాజాగా ఎగ్గేరియన్స్ అంటూ మరో వర్గం కూడా వచ్చి చేరగా, కొద్ది రోజుల్లోనే ఈ వర్గం కిందకు వచ్చిన వారి సంఖ్య కూడా పెరిగిపోతున్నారు. వీళ్లు ఎవరంటూ శాఖాహారులే అయినా.. గుడ్డును, గుడ్డు ఉత్పత్తులను లాగించేవారన్నమాట.

తక్కువ రేట్లో ఎక్కువ పోషకాలుండే మంచి ఆహార పదార్థం గుడ్డు. దీంతో రోజూ కోట్లకి కోట్ల గుడ్లు సేలవుతున్నాయి. అందుకే గుడ్డుకి భారీ డిమాండ్ పెరిగింది. రోజూ ఓ గుడ్డు తింటే హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనిలేదని చెబుతుంటారు పెద్దలు. ఆరోగ్య ప్రదాతగా పెద్ద పేరే ఉంది ఈ బుల్లి గుడ్డుకి. అసలు గుడ్డు నుంచి వాటిని తినేవారికి ఏం లభిస్తుందన్న విషయంలోకి ఎంటరవుదామా..? 60 గ్రాముల గుడ్డులో  7.9 గ్రాముల ప్రొటీన్‌, 7.9 గ్రాముల కొవ్వులు, 103 కేలరీల శక్తి, 36 గ్రాముల కాల్షియం, 132 మిల్లిగ్రాముల ఫాస్పరస్‌, 1.26 మిల్లిగ్రాముల ఇనుము పోషకాలు వున్నాయి.

గుడ్డును చూడగానే నోరూరని వారుండరంటే అతిశయోక్తి కాదు. వెజ్ అయినా.. నాన్ వెజ్ స్పెషల్ అయినా గుడ్డుతోనే ఆ డైనింగ్ చిట్టాకు పరిపూర్ణత చేకూరుతుంది. చిన్న పిల్లల నుంచి ముసలివారి వరకు.. మంచి విటమిన్ లున్న ఫుడ్ కావాలంటే వారి మెనూలో ఎగ్ ఉండాల్సిందే. స్కూల్స్, అంగన్ వాడీ స్కూల్స్, ప్రైవేట్  హాస్టల్స్ అన్ని చోట్లా గుడ్డుది ప్రత్యేక స్థానమే. ఏటేటా అన్నిచోట్లా గుడ్డు వాడకం పెరిగిపోతోంది. ఒకరు ఆమ్లెట్ అంటారు. ఒకరు ఫ్రై అంటారు. ఇంకొకరు బాయిల్డ్ అంటారు. ఎగ్ మిర్చి.. ఎగ్ బుర్జీ.. ఎగ్ బజ్జీ ఇలా రకరకాల పేర్లతో ఎగ్గుని ఏపుకుని తింటున్నారు జనం.

గుడ్డులో పచ్చసోన కూడా తినోచ్చా..?

తెల్లసొనలో 90 శాతం నీరు ఉంటుంది. మిగతా 10 శాతంలో అల్బుమిన్‌, గ్లోబులిన్‌ వంటి ప్రొటీన్లు, కొంత బీ2(రెబోఫ్లావిన్‌) ఉంటాయి. అన్ని రకాల పోషకాలు అంటే...మాంసకృత్తులు, కొవ్వు, ఏడీబీ-12 వంటి రకాల విటమిన్లు, ఫోలిక్‌యాసిడ్‌, కాల్షియం, ఇనుము, జింకు, సెలీనియం అనే యాంటిఆక్సిడెంట్లు పచ్చసొనలోనే ఉంటాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే రోజుకు మూడుకు మించి గుడ్లు తీసుకునేవారు పచ్చసోన తీసుకోకపోవడమే మంచిదని, అయితే ఒక్క గుడ్డు తినేవారు పచ్చసోన కూడా లాగించేయవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

గుడ్డ వల్ల కలిగే  ప్రయోజనాలు పరిశీలిద్దామా..:

* రక్తహీనత సమస్యను గుడ్లు అరికడతాయి.
* అధిక బరువు నియంత్రనతోపాటు తక్కువ బరువు సమస్యకు పరిష్కారం
* పెద్దవారిలో కండరాలు క్షీణించకుండా కాపాడుతుంది.
* పసి పిల్లలకు ఉడికించిన పచ్చసొన పోషకాలను అందిస్తుంది.
* చాలామంది డైటింగ్‌ చేసేవారు కూడా తమ మితాహారంలో గుడ్డును చేర్చుకుంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : world egg day 2017  hyderbadis  Eggetarian  good symptoms  protiens  vegetarian  

Other Articles