విద్యార్థులలో నేరప్రవృత్తి పెరుగుతూ పోతుందని చెప్పడానికి ఈ ఘటన మరో ఉదాహరణ, ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు భవిష్యత్తుపై అనేక అశలతో రాణించాల్సిందిపోయి.. చిన్నాచితక విషయాలకు ఏకంగా కత్తులతో వచ్చి తోటి విద్యార్థిపై దాడికి తెగబడిన ఘటన అలస్యంగా వెలుగుచూసింది. మేడ్చల్ సమీపంలోని మైసమ్మగూడ వద్ద నున్న నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. కత్తిపోట్లకు గురైన విద్యార్థి పరిస్థితి విషమంగా వుంది. దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన మరో విద్యార్థికి కూడా రక్తపు గాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే... హైదరాబాదు శివారు మైసమ్మగూడలోని నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో రోహిత్ (20), భువనేశ్వర్ (20), వైభవ్ (20) లు బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నారు. ఒకే తరగతి కావడంతో కళాశాలలోని ఇతర స్నేహితులతో కలిసి వాట్స్ యాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల రోహిత్, భువనేశ్వర్ ల మధ్య చిన్నపాటి వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో దీపావళి రోజు రాత్రి ‘రేపు (శుక్రవారం) రోహిత్ ను నేను కొట్టబోతున్నాను’ అంటూ భువనేశ్వర్ వాట్స్ యాప్ గ్రూపులో మెసేజ్ పెట్టాడు.
దీనిని చదివిన రోహిత్ నిన్న ఉదయం తన స్నేహితులతో కలిసి కాలేజీకి వెళ్లాడు. అప్పుడే బస్సులో కళాశాలకు వచ్చిన భువనేశ్వర్ పై కత్తితో దాడి చేశాడు. స్నేహితులు భువనేశ్వర్ చేతులు పట్టుకోగా రోహిత్ దాడికి దిగాడు. దీంతో భువనేశ్వర్ ముఖం, చేతులు, నడుముకు గాయాలయ్యాయి. దీనిని చూసిన వీరి మిత్రుడు వైభవ్ ఆ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో అతనికి కూడా గాయాలయ్యాయి. దీంతో హుటాహుటీన బాధితులను ఆసుపత్రికి తరలించారు.
దీనిపై సమాచారం అందడంతో హైదరాబాదు శివారు పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. రోహిత్ పరారీలో ఉండడంతో అతని కోసం గాలింపు చేపట్టారు. దీనిపై క్షతగాత్రుడు భువనేశ్వర్ తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల విద్యార్థి కత్తులతో కళాశాలలో ప్రవేశించడమేంటని ప్రశ్నించారు. చదువుకోసం కళాశాలకు వెళ్తున్నారా? లేక గూండాలుగా మారేందుకు వెళ్తున్నారా? అని ఆమె ప్రశ్నించారు. కాగా, భువనేశ్వర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more