TDLP secretary attacked by TRS MP heir దాడి చేసింది ఎంపీ కూతురేనా..పోలీసుల దర్యాప్తు

Police investigatation on women claminig trs mp daughter

Woman attacked, couple, Suresh, bhanu, Police complaint, hyderabad police, banjara hills police, TRS MP daughter, crime

hyderabad police begins investigation in an attacking incident where the two parties complained on each other. And also investigates the claims of one party stating that she is ruling party MP's daughter

దాడి చేసింది ఎంపీ కూతురేనా..పోలీసుల దర్యాప్తు

Posted: 10/23/2017 10:43 AM IST
Police investigatation on women claminig trs mp daughter

హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ పదిలో వున్న సిటీ సెంట్రల్ మాల్ లో జరిగిన ఘటపలో పోలీసుల దర్యాప్తు వేగిరం చేశారు. ముందుగా.. ఘటన ఎలా జరిగింది.. అందుకు కారణం ఎవరూ అన్న వివరాలను తెలసుకునే పనిలో పడిన పోలీసులు.. ఇందుకు సంబంధించిన సిసిటీవీ ఫూటేజీని పరిశీలించారు. ఇక ఈ ఘటనపై ఇరువర్గాలు పోలిస్ స్టేషన్ కు వెళ్లి పరస్పరం పిర్యాదు చేసుకోవడంతో.. వారు పోందుపర్చిన అధారాలను నిజమైనవేనా అని తేల్చుకునే పనిలో పడ్డారు.

మరీ ముఖ్యంగా తాను తెలంగాణ అధికారిక టీఆర్ఎస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడి కూతురినంటూ పేర్కొనడంతో.. అ దిశగా ముందుగా పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఇక మరో వర్గం తాను టీపార్టీ ప్రభుత్వ ఉద్యోగిననని, అంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ శాసనసభాపక్షం కార్యాలయం కార్యదర్శిగా బాధ్యతులు నిర్వహిస్తున్నాడని బాధితుడు సురేష్ పోందుపర్చిన విషయం తెలిసిందే. సురేష్‌ తన భార్యతో భానుతో కలసి బంజారాహిల్స్ లోని సిటీసెంటర్ మాల్ కు షాపింగ్ చేయడానికి రాగా.. ఓ యువతి వారిని ఢీకోనడంతో పాటు తాను ఎంపీ కూతురినంటూ బెదిరింపులకు దిగింది. కనీసం తన తండ్రి వయస్సున్న వ్యక్తికి కనీస మర్యాదు కూడా ఇవ్వకుండా దౌర్జన్యానికి పాల్పడింది.  

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. సురేష్ తన భార్య భాను షాపింగ్ చేయడానికి సిటీ సెంటర్‌ మాల్‌ లోకి ప్రవేశించి వెళ్తుండగా, ఎధరుగా వచ్చిన ఓ యువతి వారిని ఢీకొట్టి లిఫ్ట్‌ లోకి ప్రవేశించి.. కళ్లు కనిపించట్లేదా? అంటూ వారిని  ఎదురుపశ్నించింది. సెక్యూరిటీ గార్డులు, షాపింగ్ కు వచ్చిన ఇతర కస్టమర్లు వారిస్తున్నా.. తాను ఎంపీ కూతురిని, గన్‌ మెన్‌ లను పిలుస్తున్నానని, కాల్చేస్తానని నానా హంగామా చేసింది. బాధితులు భయంతో వెళ్లిపోతుంటే, వారిని మరోసారి కారు దగ్గర అటకాయించి దాడికి దిగింది. చివరికి సెక్యూరిటీ గార్డుల సాయంతో వారిద్దరూ తప్పించుకుని పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles