Reliance Jio Plans to raise rates | జియో యూజర్లకు షాక్.. ఫ్లాన్ల మార్పు.. ఇక నుంచి మూడు నాలుగు నెలలకొకసారి కాల్ రేట్లు మార్పు

Jio shock with tariff rates

Reliance Jio, Reliance Jio Tariff, Reliance Jio Revise Rates, Reliance Jio Plans Change, Reliance Jio Profits Plan, Reliance Jio Tariffs Airtel Benifits, Goldman Sachs Reliance Jio

Reliance Jio to raise rates every few months. The telco last week raised its tariffs by 15-20% indicating early signs of stability in the telecom sector ravaged by price wars. Brokerage firm, Goldman Sachs (GS) in its report said “We expect Jio to raise tariffs every few months, with the next potential increase in January 2018,” analysts of the US based brokerage company added in its report dated October 24.

జియో యూజర్లకు షాకింగ్ న్యూస్

Posted: 10/25/2017 10:59 AM IST
Jio shock with tariff rates

భారతీయ టెలికాం రంగంలో సంచలనాలకు తెరలేపిన రిలయన్స్ జియో వినియోగదారులకు మెల్లిగా షాకిచ్చేందుకు సిద్ధమౌతోంది. ఇప్పటికే కస్టమర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకున్న జియో.. ఇప్పుడు నెమ్మదిగా లాభాలపై దృష్టిసారించినట్లు సమాచారం. ఈ మేరకు మూడు నాలుగు నెలలకొకసారి టారిఫ్ లను క్రమంగా పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.

ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్ మన్ సచ్ వెల్లడించిన వివరాల ప్రకారం... అక్టోబర్ 18 నుంచి టారిఫ్ లను 15 నుంచి 20 శాతం వరకు పెంచేసిన జియో... మరోసారి ఆ దిశగా అడుగులు వేస్తోంది. జనవరిలో ఇది మరోసారి ఉండబోతున్నట్లు ఆ నివేదికలో పేర్కొంది. యూజర్ పై వచ్చే సగటు రెవెన్యూను పెంచుకునే పనిలో పడిందని తెలిపింది. ప్రస్తుతం ఉన్న రూ. 309 ప్యాకేజీ గడువును 49 రోజుల నుంచి 28 రోజులకు కుదించే అవకాశం ఉందని.. 399 రూపాయల త్రీ మంత్స్ ఫ్లాన్ (84 రోజుల)ను.. 459 రూపాయల ఆఫర్ గా మార్చి కేవలం 70 రోజులకే కుదించనుందని పేర్కొంది.

ఇప్పటికే డేటా ప్యాక్ ల విషయంలో మార్పులు చేసిన విషయం తెలసిందే. ఇదే సమయంలో, జియో టారిఫ్ ల పెంపుతో ఎయిర్ టెల్ ఎక్కువగా లాభపడుతుందని గోల్డ్ మన్ అంచనా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles