Hyderabad Metro Train Project Specialties Details | హైదరాబాద్ మెట్రో.. దేశంలోని దేనికీ లేని ప్రత్యేకతలు.. ఏంటో తెలుసా?

Hyderabad metro details

Telangana Metro Train, Hyderbad Metro Specialties, Hyderabad Metro Special, Hyderbad Metro Project, Modi Hyderbad Metro, Hyderbad Metro Low Cost, Hyderabad Metro Railway Project, Hyderabad Metro Driverless, హైదరాబాద్ మెట్రో ప్రత్యేకతలు, మెట్రో రైలు ప్రత్యేకతలు, హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు ప్రత్యేకతలు

Specialties of Hyderabad Metro Railway Project. Telangana wants Hyderabad Metro Rail fares lower than other cities.PM Modi to inaugurate Hyderabad Metro Rail on Nov 28

మన మెట్రో.. మస్తు ప్రత్యేకతలు

Posted: 10/26/2017 08:20 AM IST
Hyderabad metro details

దేశంలోనే అత్యద్భుతంగా తెలంగాణ మెట్రో ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. శరవేగంగా ముస్తాబవుతున్న మెట్రో వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంటున్న ఈ మెట్రో రైలు దేశంలోనే తొలి డ్రైవర్ లెస్ ప్రాజెక్టుగా ఇప్పటికే గుర్తింపు పొందింది. ఇదే సమయంలో మరిన్ని బోలెడన్నీ ప్రత్యేకతలు ఉన్నాయి కూడా.

- టికెట్ల విషయంలోనూ భాగ్యనగర మెట్రోకు ప్రత్యేకత ఉంది. టికెట్ లేకుండా లోపలికి ప్రవేశించే అవకాశమే ఉండదు. ఇక టికెట్ తీసుకోకుండా మెట్రోలోకి ప్రవేశించే అవకాశమే లేకుండా ఎలక్ట్రానిక్ గేట్లను ఏర్పాటు చేస్తున్నారు. టికెట్ల కోసం ఆటోమేటిక్ వెండింగ్ మెషిన్లను ఏర్పాటు చేస్తున్నారు. టికెట్ తీసుకున్నాక దానిని ఎలక్ట్రానిక్ గేట్లపై పెడితేనే డోర్లు తెరుచుకుంటాయి. ఎగ్జిట్, ఎంట్రీలలో ఈ గేట్లు ఉంటాయి.

- సిగ్నలింగ్ నుంచి రైలు నియంత్రణ, భద్రత వరకు అన్నింటా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. 

- భద్రత కోసం ఆటోమేటిక్ ట్రెయిన్ ప్రొటెక్షన్ (ఏటీపీ) వ్యవస్థ ఉంటుంది. రైలులో చిన్న పొరపాటు జరిగినా గుర్తించి అప్రమత్తం చేస్తుంది. మానవ వనరులను అతి తక్కువ స్థాయిలో                   వినియోగిస్తుండడం వల్ల తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

- రైళ్లు ఎంత వేగంతో వెళ్లాలి? స్టేషన్‌లో ఎంత సమయం ఆపాలి? అనేది ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ (ఓసీసీ) నుంచే జరుగుతుంది. అత్యవసర సమయాల్లో రైళ్లను ఆపేందుకు ఎమర్జెన్సీ స్టాప్           ప్లంగర్స్‌ను ఏర్పాటు చేశారు.

- ప్రతీ దృశ్యాన్ని రికార్డు చేసేందుకు ప్రతీ కోచ్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు.


కంట్రోల్ రూము నుంచే దీనిని నియంత్రించనున్నారు. కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ (సీబీటీసీ) సాంకేతిక పరిజ్ఞానంతో రైళ్లు నడుస్తాయి. ప్రయాణికులను సురక్షితంగా వారివారి గమ్యస్థానాలకు చేర్చుతాయి. నగరంలోని 72 కిలోమీటర్ల పరిధిలో మూడు కారిడార్లలో 57 మెట్రో కోచ్‌ల నియంత్రణ మొత్తం ఉప్పల్‌లోని ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ నుంచే జరుగుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles