కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి పొందేందుకు ఆధార్ అనుసంధానం చేయడానికి చివరి గడువును ఇప్పటికే ప్రకటించిన కేంద్రం.. ఇక అనుసంధానం చేయడానికి సమ్మతించే వారికోసం ఈ గడువును మరికొన్ని నెలల పాటు పెంచుతున్నట్లు కేంద్ర దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ డిసెంబరు 21వ తేదీతో ముగియనున్న గడువును రానున్న మార్చి 31 వరకు పెంచుతున్నట్లు.. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్.. దేశఅత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు తెలిపారు.
ప్రభుత్వ పథకాలకు, బ్యాంకు ఖాతాలకు, మొబైల్ నెంబర్లకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించిన సమయంలో కేంద్రం ఈ మేరకు తెలిపింది. ఇదే క్రమంలో బ్యాంకు అకౌంట్లకు, మొబైల్ నెంబర్లకు ఆధార్ అనుసంధానం చేసుకోని వారిపై తీసుకుంటారన్న విషయాన్ని వచ్చే సోమవారంలోగా తెలపాలని అదేశించింది.
సిమ్ కార్డులను ఆధార్ తో లింక్ చేసే ప్రక్రియ మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిబంధనల్లో మార్పులు చేసింది. వినియోగదారుల ఇంటి దగ్గరకు వెళ్లి ఆధార్ ధ్రువీకరణ తీసుకోవడం, వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) ఆధారిత పరిశీలన ప్రత్యామ్నాయ విధానాలను అమలు చేయాలని నిర్ణయించింది. టెలికాం కంపెనీల సిమ్ కార్డులు ఉపయోగిస్తున్న వినియోగదారుల్లో వృద్ధులు, వికలాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు ఉండే అవకాశం ఉండటంతో.. వినియోగదారుల ఇంటి దగ్గరకే వెళ్లి అనుసంధానం ప్రక్రియ పూర్తిచేయాలని కేంద్రం కంపెనీలకు సూచించింది.
దీంతోపాటు ప్రజల విజ్ఞప్తి మేరకు ఆన్ లైన్ విధానాన్ని కూడా రూపొందించాలని ఆపరేటర్లకు స్పష్టం చేసింది. మొబైల్ యూజర్ల ఆధార్ వెరిఫికేషన్ కోసం ఆధార్ ఓటీపీ సేవలను ఎస్ఎంఎస్, ఐవిఆర్ఎస్ లేదా లేదా మొబైల్ యాప్ ద్వారా అందించేలా ఒక పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరింది. ఆధార్ డేటాబేస్లో ఒక మొబైల్ నంబర్ నమోదై ఉంటే.. ఓటీపీ పద్ధతి ద్వారా అదే మొబైల్ నంబర్ తోపాటు వినియోగదారునికి ఉన్న ఇతర నంబర్లను కూడా ధ్రువీకరించవచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more