Ola sends samosas to this Gurgaon man ఓలా.. కస్టమర్ కు సమోసాలను పంపింది.. ఎందుకు.?

Ola sends samosas to this gurgaon man over cab cancellation charges

Ola, Ola cabs, Ola Cab, Ola cancellation charges, Cab Cancellation Charges, Ola Samosa, Cancellation Charges, Ola Cab, Gurgaon, Abhishek Asthana, Samosa

Abhishek Asthana had booked an Ola cab and the driver denied duty. Instead, the company charged cancellation fee from his account.

ఓలా.. కస్టమర్ కు సమోసాలను పంపింది.. ఎందుకు.?

Posted: 10/26/2017 05:46 PM IST
Ola sends samosas to this gurgaon man over cab cancellation charges

ఓ కస్టమర్ కామెంట్ తో సామాజిక మాద్యమంలో మొదలైన గోల... ఓలా కంపెనీకి శరాఘాతంలా పరిణమించాగా.. ఈ అపఖ్యాతిని, అప్రదిష్టను చెరుపుకునేందుకు సంస్థ చేసిన యత్నాలు నెట్ జనుల కామెంట్లను, ప్రశంసలను అందుకునేలా చేశాయి. నెట్టింట్లో సంచలనం దెబ్బకి దిగోచ్చిన కంపెనీ వినూత్న తరహాలో స్పందించింది. కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంది. ఇంతకీ ఓలాకు కస్టమర్ కు మధ్య ఏం జరిగిందన్న వివరాల్లోకి వెళ్తే..
 
గుర్గావ్‌కి చెందిన అభిషేక్ ఆస్థాన అనే యువకుడు ఈ నెల 21న ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నాడు. తన సోదరుడితో పాటు వెళ్లేందుకు విమానాశ్రయం వద్ద ఎదురుచూస్తుండగా... ఓలా డ్రైవర్ క్యాబ్ కాన్సిల్ చేసుకున్నాడు. అయితే క్యాన్సిలేషన్ ఫీజు మాత్రం అభిషేక్‌కి పడింది. తన తప్పులేకుండా బలవంతంగా క్యాన్సిలేషన్ ఫీజు వసూలు చేయడంపై ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. దీంతో ఓలాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్విటర్ లో వ్యంగ్యంగా కంప్లెయింట్ ఇచ్చాడు.

‘‘డ్రైవర్ తన డ్యూటీ నిరాకరించినా.. ఓలా మాత్రం క్యాన్సిలేషన్ ఫీజు వసూలు చేసింది. ఇదెలా ఉందంటే.. ‘‘సమోసా ఉందా?’’ అని అడిగితే.. ‘‘లేదు’’ అంటూనే షాపు యజమాని 10 రూపాయలు వసూలు చేసినట్టుంది...’’ అని ట్వీట్ చేశాడు. అంతే... క్యాన్సిలేషన్ ఫీజు పడిన ఓలా కస్టమర్లంతా సదరు కంపెనీపై ఇదే కామెంట్ రిపీట్ చేస్తూ ఓలాకి తలనొప్పి తెప్పించడం మొదలు పెట్టారు. దీంతో అభిషేక్ ట్వీట్‌పై ఓలా కంపెనీ స్వయంగా స్పందించింది.
 
‘‘క్యాన్సిలేషన్ చార్జిలు తిరిగి జమచేశాం... మీకు కలిగిన ఇబ్బందికి చింతిస్తున్నాం. ఇప్పుడు సమోసాలు ఎక్కడికి పంపించమంటారు?’’ అని ఓలా ట్వీట్ చేసింది. అంతేకాదు... అభిషేక్‌కి ఫోన్ చేసి మరీ సమోసాలు పంపించింది. అభిషేక్ తో పాటు ఆయన సోదరుడికి కూడా క్షమాపణ చెబుతూ ఓ లేఖ జతచేసి పంపింది. ఓలా స్పందించిన తీరుపై చాలామంది అభినందనలు తెలుపుతుండగా... మరికొందరు అభిషేక్‌కి సరదాగా సలహా ఇచ్చే పనిలో పడ్డారు. ‘‘సమోసా బదులు ఏదైనా బంగారు నగలతో పోల్చి కామెంట్ చేస్తే బాగుండేది.. అప్పుడు మీకు బంగారు ఉంగరం వచ్చేది’’ ఒకాయనంటే ... ‘‘మీరు ఓ ఐఫోన్ తో పోల్చి చెప్పాల్సింది..’’ అని మరో నెటిజన్ చమత్కరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cancellation Charges  Ola Cab  Gurgaon  Abhishek Asthana  Samosa  

Other Articles