రైలు ప్రయాణికులకు ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా కేంద్ర రైల్వే శాఖ చర్యలు తీసుకుంటుంది. ప్రయాణంలో రైలు ప్రయాణికులకు తలత్తే సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు గాను దృష్టి సారించింది. భద్రతాపరమైన సమస్యతో పాటు నీరు, అహారం తదితర ఎలాంటి సమస్యలనైనా ఇక వేగంగా పరిష్కారించుకోవచ్చు. ఇందుకోసం రైల్వేశాఖ కొత్తగా ప్రవేశపెట్టిన అన్ లైన్ విధానంలో అధికారులకు సమస్యను తెలిపితే చాలు.
అదెలా అంటారా..? దేశంలో ఎక్కడ నుంచైనా ఎవరైనా రైలులో ఎదుర్కొనే ఇబ్బందులు, కష్టాలను నేరుగా సంబంధిత అధికారులకు పిర్యాదు చేయవచ్చు. దీనికోసం ఎలాంటి ఖర్చు ఉండదు. మీ వద్ద ఉన్న మొబైల్ పోన్ ద్వారా టోల్‌ఫ్రీ నెంబర్లకు సందేశం పంపిస్తే చాలు. దీనికోసం రైల్వే శాఖ టోల్ ఫ్రీ నెంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే టోల్ ఫ్రి నెంబర్లు గుర్తుపెట్టుకోవాల్సి బాధ్యత ప్రయాణికులపైనే వుంది.
రైల్వే రిజర్వేషన్ కోసం...
ఐఆర్‌సీటీసీ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తరువాత ఏ ప్రాంతానికి ఎప్పుడు వెళ్లాలి? ఏ రైళ్లో వెళ్లాలి? ఎంతమంది అనే విషయాలను ప్రయాణీకుల పేర్లతోపాటు అడ్రస్ నమోదు చేయాలి. ఇలా ఆన్‌లైన్ ద్వారా రిజర్వేషన్ చేసుకోవడానికి వెసులుబాటు వుంది.
టోల్‌ఫ్రీ నెంబర్ 182
రైళ్లలో భద్రత పరంగా ఏదైనా ఇబ్బందులు ఎదురైతే మెసేజ్ టైప్ చేసి ఈ నెంబరుకు సందేశం పంపాలి.
138
రైళ్లు ఆలస్యం, ఏ స్టేషన్‌కు రైలు ఎప్పుడు వస్తోందో తెలుసుకోవడానికి మొబైల్ పోన్ నుంచి సందేశం టైప్ చేసి ఈ టోల్‌ఫ్రీ నెంబరుకు పంపితే వెంటనే సమాచారం వస్తోంది.
ఇక రైళ్లలో ప్యాన్లు తిరగకపోవడం, ఏసీ పనిచేయకున్నా, మరుగుడొడ్లలో నీళ్లు లేకున్నా, రైల్వే స్టేషన్‌లలో అధిక ధరలకు తినుబండారాలు, వస్తువులు అమ్ముతున్నా, ప్లాట్‌ఫారాలు శుభ్రంగా లేకున్నా వెంటనే సంబంధిత మెసేజ్‌లను టైప్ చేసి 8121281212కు ఎస్‌ఎంఎస్ చేయాలి. ఇలా పంపిన సందేశాలు జనరల్ మేనేజర్ వద్ద వున్న కంట్రోల్ రూమ్‌కు వెళుతుంది. అక్కడ ఉన్న సిబ్బంది సంబంధిత విభాగాలకు సందేశాలను పంపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more