Now, end of Rs 2000 note looks increasingly inevitable వార్సికోత్సవ వేళ.. రద్దుతో రూ.2000 నోటుపై గంధరగోళం

Now end of rs 2000 note looks increasingly inevitable

demonetisation, Supreme Court, SC, old notes, demonitised notes, sudha mishra, petition, centre, PM Modi, Arun Jaitley, finance ministry, RBI, Rs 2000 note

On November 8 last year, PM Modi declared that Rs 500 and Rs 1,000 notes would cease to be legal tender from midnight, and would be replaced by new Rs 500 and Rs 2,000 rupee notes.

వార్సికోత్సవ వేళ.. రద్దుతో రూ.2000 నోటుపై గంధరగోళం

Posted: 11/03/2017 06:52 PM IST
Now end of rs 2000 note looks increasingly inevitable

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోందా? సరిగ్గా వార్షికోత్సవ వేళ.. భారతీయ మార్కెట్లో పెద్దనోటుగా చెలామని అవుతున్న రూ.200 నోటును ఉపసంహరించుకోనుందా..? నోట్ల రద్దు వ్యవహారంతో అందరూ నోట్ల రద్దుతో అందోళన చెందుతున్న క్రమంలో.. గుట్టుచప్పుడు కాకుండా కొత్తగా చెలమాణిలోకి వచ్చిన రూ. 2 వేల నోటును ఏడాది ముగిసి ముగియగానే రద్దు చేసేందుకు యోచిస్తుందా..? అంటే అవునన్నే సంకేతాలే వస్తున్నాయి. సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వం ఇచ్చిన సమాచారం చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.

నల్లధనాన్ని సమూలంగా నిర్మూలించే ఉద్దేశంతో గతేడాది నవంబరు 8న పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో నవంబర్ 10న ఈ నోటు చలామణిలోకి వచ్చింది. కాగా నోట్ల రద్దు నిర్ణయాన్ని దేశప్రజలు స్వాగతించినా..  క్రమంగా విమర్శలు అంతకు ఎక్కువ స్తాయిలోనే చెలరేగాయి. అమెరికా మీడియాతో పాటు సొంత పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తూ వ్యతిరేకించారు. దీంతో ఇరకాటంలో పడిన ప్రభుత్వం తప్పు దిద్దుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నట్టు జాతీయ పత్రికల్లో కథనాలు కూడా వస్తున్నాయి.

కాగా భారతీయ కేంద్రీయ బ్యాంకు అర్బీఐ కూడా అటువంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది. సమాచార హక్కు చట్టం కింద ఇటీవల ఓ టీవీ చానల్ ఆర్బీఐని వివరణ కోరగా ప్రస్తుతం రూ. 2 వేల నోట్ల ముద్రణను ఆపేసినట్టు పేర్కొంది. నోట్ల ముద్రణకు సంబంధించి ఆర్బీఐ నుంచి తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ప్రస్తుతానికైతే రూ. 500, రూ. 50, రూ. 5, రూ. 2 నోట్లను మాత్రమే ముద్రిస్తున్నట్టు బదులిచ్చింది. ఫలితంగా రూ. 2 వేల నోటు రద్దు ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు రూ. 2 వేల నోట్లను ప్రవేశపెట్టి ఏడాదైనా కాకముందే ఉపసంహరించుకుంటే నోట్ల రద్దు విఫల ప్రయోగమనే వార్తలకు బలం చేకూర్చినట్టు అవుతుందని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకనే రాజకీయ పరిణామాలను జాగ్రత్తగా అంచనా వేస్తూ సరైన సమయంలో రూ. 2 వేల నోటును రద్దు చేసి తిరిగి రూ. 1000 నోటును ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తుందా అన్న ప్రశ్నలకు బలం చేకూరుతుంది. ఇక మరికోందరు మాత్రం సరిగ్గా గుజరాత్, హిమాఛల్ రాష్ట్రాల ఎన్నికలకు ముందు ఇలాంటి వార్తను జనంలోకి లీక్ చేసి.. ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీయాలని కూడా కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం పధకంలో భాగమైవుండవచ్చునన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles