ప్రపంచ కుబేరుల బినామీ అస్తులు, అక్రమ పెట్టుబడులు, ఎక్కడెక్కడ ఎలా పెట్టారన్న విషయాలతో కూడా వివరాలను వెల్లడించిన ’పనామా పేపర్స్’ యావత్ ప్రపంచంతో పాటు ఇటు భారత్ దేశాన్ని కూడా కుదిపేసింది. అన్నింటికంటే అధికంగా పాకిస్థాన్ ప్రథాని నవాజ్ షరీఫ్ ను పదవీచ్యుతిడిని కూడా చేసింది. అతను పదవిలో కొనసాగేందుకు అనర్హుడంటూ ఏకంగా అదేశ సర్వోన్నత న్యాయస్థానమే తీర్పును వెల్లడించడంతో చేసేది లేక తన సోదరుడికి పదవిని కట్టబెట్టి పక్కకు తప్పకున్నాడు షరీఫ్.
దాయాధి దేశంలో అంతటి విపత్కర పరిణామాలకు దారి తీసి ప్రకంపనలు సృష్టించిన ఈ పేపర్లు భారత్ లో కూడా అరంభంలో బాగానే హల్ చల్ చేశాయి. అటు బిగ్ బి అమితాబ్ బచ్చన్ నుంచి ఆయన కోడలు ఐశ్వర్యరాయ్, అజయ్ దేవగన్, కాజల్ అగర్వాలు ఇక ఇటు నవ్యాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సంస్థలో డైరెక్టర్ గా వున్న ప్రముఖుడితో పాటు అనేక మంది పేర్లు వెలుగుచూశాయి. ఈ జాబితాలోని పెద్దలందరిపై కమిటీ వేసి విచారణ సాగిస్తామని కూడా కేంద్ర స్పష్టం చేసింది. అయితే అది ఏమైందన విషయం మాత్రం కేంద్రానికే తెలియాలి.
ఇలా పనామా సృష్టించిన కల్లోలాన్ని ఇప్పుడిప్పుడే మర్చిపోతున్న ప్రజల ముందుకు తాజాగా ‘పారడైజ్ పేపర్స్’ వెలుగులోకి వచ్చి పనామాను గుర్తుచేయడంతో పాటు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. న్యాయ సలహాలు అందించే ‘అప్లెబీ’ అనే సంస్థకు చెందిన డేటా లీక్ కావడంతో.. ఇది కాస్తా 714 మంది భారతీయుల గుండెల్లో అలజడిని రేపుతోంది. ప్రపంచంలోని 180 దేశాలకు చెందిన డేటా లీక్ అయినట్లు తెలుస్తుండగా, అందులో సంఖ్యా పరంగా భారత్ నుంచి వున్న నల్లకుబేరులకు 19వ స్థానం దక్కింది. ఇక అప్లెబీ ఖాతాదారుల్లో ప్రపంచంలోనే భారత నల్లకుబేరులు రెండోస్థానంలో నిలిచారు.
ఏకంగా 714 మంది దేశానికి పన్ను ఎగ్గొట్టి విదేశాల్లో దాస్తున్నారన్న విషయం మరోమారు స్పష్టంమైంది. పెద్ద నోట్లు రద్దు చేసి ఈ నెల 8కి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం ‘యాంటీ-బ్లాక్ మనీ డే’ను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుండగా, ప్యారడైజ్ లీకేజీ ప్రభుత్వ అశలపై నీల్లు చల్లింది. ప్రభుత్వం కళ్లుగప్పి నల్లకుబేరులు ఎలా డబ్బును బయటకు పంపుతున్నారన్న ప్రశ్నలను సంధిస్తుంది. నల్లధనం అరికట్టేందుకు నోట్లరద్దు చేశామన్న ప్రభుత్వ వాదనను సామాన్యుల నుంచి ప్రతీఒక్కరు ప్రశ్నలవర్షం కురిపించేలా చేస్తుంది. ఇక విపక్షాలు మాత్రం ఇప్పటికే విమర్శలు గుప్పిస్తుంగా ఇది వారి చేతికి మరో అస్త్రంగా మారనుంది.
సరిగ్గా యాంటీ బ్లాక్ మనీ డే కు రెండు రోజుల ముందు.. ఈ పేపర్లు లీక్ కావడం ప్రభుత్వ సాహసోపేత నిర్ణయం, ప్రజలను బలవంతంగా పాటిస్తోంది. దీనికి రెండు రోజుల ముందే పారడైజ్ పేపర్స్ లీకేజీ సంచలనం సృష్టిస్తోంది. లీకైన డాక్యుమెంట్లలో భారత్ కు చెందిన 714 మంది నల్లకుబేరుల పేర్లు కూడా వున్నాయన్న సమాచారంతో ప్రభుత్వపు మాటలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఇక ఇందులో నవ్యాంద్ర రాష్ట్రానికి చెందిన విపక్ష నేత వైఎస్ జగన్ పేరు కూడా వుందన్న వార్తలు అక్కడి రాజకీయాలను కూడా వెడెక్కిస్తున్నాయి. అమెరికా వాణిజ్య మంత్రి విల్ బర్ రోస పేరు కూడా ఉంది. పనామా పేపర్లను లీక్ చేసిన ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) తాజాగా ప్యారడైజ్ పేపర్లను కూడా లీక్ చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more