ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఇవాళ హైదరాబాద్ కలెక్టరేట్ ముందు ఎమ్మార్పీఎస్ చేబట్టిన ఆందోళనలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఎమ్మార్పీఎస్ ఉద్యమనారి, విరవనిత భారతి అసువులు బాసారు. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న తోపులాటలో భారతి అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ ప్రకటన చేశారు.
పోలీసులు ఒక్కొక్కరినీ అడ్డుకుని వాహనంలో వేసి తరలిస్తున్నారని, ఆందోళనలో అస్వస్థతకు గురైన ఆమెను హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి తరలించారని చెప్పారు. అయితే, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారని కేసీఆర్ చెప్పారు. ఈ ఘటనపై సర్కారు విచారణ జరుపుతోందని తెలిపారు. మృతురాలి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్ధిక సాయం అందిస్తామని ప్రకటించారు. అసెంబ్లీలో చర్చ జరుగుతుండగా బయట ఈ ఘటన చోటు చేసుకుందని అన్నారు.
ఈ ఘటన జరగడం దురదృష్టకరమని కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అమె కుటుంబానికి తన సంతాపాన్ని తెలియజేశారు. అప్పట్లో ఈ వర్గీకరణను ప్రతిపాదించిన వారిలో తాను కూడా ఒకరినని అన్నారు. అనేకసార్లు వర్గీకరణకు మద్దతు తెలిపానని తెలిపారు. ఈ మధ్య కాలంలో ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలిసి దీనిపై చర్చించానని అన్నారు. అఖిల పక్షాన్ని కూడా తీసుకెళ్దామని అనుకున్నానని కేసీఆర్ చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more