సినీ నటి, మాజీ ఎంపీ, తెలంగాణ సీనియర్ నేత విజయశాంతికి తెలంగాణ కాంగ్రెస్ లో సముచిత స్థానం దక్కనుందా..? అంటే అవునన్న సంకేతాలే వినబడుతున్నాయి. గత ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విజయశాంతి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవందర్ రెడ్డి చేతిలో ఓటమి చెందిన నాటి నుంచి అమె కాంగ్రెస్ పార్టీతో కొంత దూరంగానే వుంటూ వచ్చారు. అయితే ఇటీవల తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయమన్న అంచనాలకు తోడు తెలంగాణ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరడంతో.. అమె కొంత కినుకు వహించారని సమాచారం.
దీంతో విజయశాంతిని తమ పార్టీ మిస్ చేసుకోవడం ఇష్టంలేని టీపీసీసీ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అమెతో చర్చలు నిర్వహించారు. తన ఓటమి తరువాత పార్టీ తనను దూరం పెట్టిందని, తనకు పార్టీలో సముచిత స్థానం కూడా కల్పించలేదని అమె అసంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం. దీంతో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ రామచంద్ర కుంతియా సహా ఉత్తమ్ కుమార్ రెడ్డిలు అమెను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యేలా చోరవ తీసుకున్నారు. పార్టీలో అమెకు సముచిత స్థానంతో పాటు గౌరవం కూడా లభిస్తుందని రాహుల్ హామీ ఇచ్చారని సమాచారం.
దీంతో మళ్లీ లేడీ అమితాబ్ కాంగ్రెస్ రాజకీయాలలో చక్రం తిప్పనున్నారు. పార్టీలో కీలకమైన పోస్టుతో పాటు ఎన్నికల ప్రచార కమిటీలో స్థానం కూడా కల్పిస్తామని హామీ రావడంతో అమె ఇక క్రియాశీలక రాజకీయాల్లోకి ఎంట్రీ కాబోతున్నారు. తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె చురుకుగా పాల్గొననున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ఆర్సీ కుంతియా తెలిపారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా అమె పనిచేస్తారని ఈ మేరకు విజయశాంతి రాహుల్ గీంధీకి హామి ఇచ్చారని పేర్కోన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more