Hyderabad streets to be free of beggars for 2 Moths | హైదరాబాద్ లో బిచ్చగాళ్లపై రెండు నెలల నిషేధం

Begging ban two moths in hyderabad

Hyderabad, Hyderabad Beggars, Begging Ban, Hyderabad Police, Ivanka Trump, Hyderabad Ivanka Tour, Ivanka Hyderabad Beggars, Hyderabad Police Beggars, Begging Ban Hyderabad, Telangana Ivanka Tour

Hyderabad streets to be free of beggars for Two months according to International Conventions.

నగరంలో బిచ్చంపై బ్యాన్

Posted: 11/08/2017 08:46 AM IST
Begging ban two moths in hyderabad

హైదరాబాద్ నగరంలో రెండు నెలలపాటు అడ్డుక్కోవటం నిషేధిస్తూ నగర పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ సదస్సు, వరల్డ్ టూరిజం సదస్సు, ప్రపంచ తెలుగు మహాసభలు... ఇలా పలు అంతర్జాతీయ సదస్సులు వరుసగా జరగనున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని ఆయన తెలిపారు.

ఒకవేళ వాటిని ధిక్కరించి బిచ్చమెత్తితే నెల రోజుల జైలుశిక్షను అనుభవించాల్సి వుంటుందని, రూ. 200 జరిమానా విధిస్తామని, ఐపీసీ సెక్షన్ 188 కింద కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. జనవరి 7వ తేదీ వరకూ ఈ ఆజ్ఞలు అమలులో ఉంటాయని తెలిపారు.కాగా, ఈ నెల 28 నుంచి ఇన్వెస్ట్ మెంట్ సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా కూడా రానుండటం, ప్రధాని హాజరై సదస్సును ప్రారంభించనుండటంతో నగర సుందరీకరణ పనులు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి.

అతిథుల కళ్ల ముందు బిచ్చగాళ్లు కనిపించరాదని, వారికి యాచకులతో ఎటువంటి సమస్య ఉండకూడదని ప్రభుత్వం భావించటం ఎలాంటి నిర్ణయం అయినా దానిని పలువురు తీవ్రంగా పట్టుపడుతున్నారు. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కొందరిని హెచ్చరించి వదిలిపెట్టడం విశేషం. ఇక ఆనంద్ ఆశ్రమం లో వారిని బిక్షగాళ్లుగా పరిగణించటంపై నిర్వాహకులు మండిపడుతున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles