Survey Gives BJP The Upper Hand In Gujarat గుజరాత్ లో మళ్లీ కమలానికే ఓటేసిన సర్వే

Abp csds survey gives bjp the upper hand in gujarat

Gujarat elections, Gujarat, Congress, BJP, Gujarat polls, Rahul Gandhi, Narendra Modi, Amit Shah, ABP-CSDS survey, BJP sweeps gujarat, politics

A survey conducted by ABP-CSDS ahead of Gujarat assembly polls has projected that the BJP will win 113-121 seats while the Congress will get 58-64 seats.

గుజరాత్ లో మళ్లీ కమలానికే ఓటేసిన సర్వే

Posted: 11/10/2017 01:05 PM IST
Abp csds survey gives bjp the upper hand in gujarat

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో ఈ పర్యాయం కూడా కమల వికసమే కలుగుతుందని తాజాగా వెల్లడైన ఓ సర్వే జోస్యం చెప్పింది. ప్రముఖ టీవీ ఛానెల్ ఏబీపీ-సీ ఎస్ డీఎస్ ఈ పర్యాయం కూడా గుజరాత్ లో బీజేపి పార్టీయే అధికారంలోకి వస్తుందని అందుకు అనుకూలంగానే ఓటు చేసింది. తమ సర్వేలో ఈ విషయాలే స్పష్టమయ్యాయని తెలిపిన ఛానెల్ ఈ మేరకు క్రితంరోజ రాత్రి ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది.

సుదీర్ఘకాలం తరువాత గుజరాత్ లో అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి మరోసారి నిరాశ తప్పదని సర్వే ప్రకటించింది. అయితే కాంగ్రెస్ తన ఓటు షేర్ ను గణనీయంగా పెంచుకునే అవకాశాలు వున్నాయని చెప్పింది. ఇక బీజేపి తన ఓటు షేర్ ను కొల్పోనుందని కూడా స్పష్టం చేసింది. మొదటి సర్వేతో పోలిస్తే.. తాజా సర్వేలో బీజేపీకి సీట్లు తగ్గే అవకాశముందని తెలిపింది.

సర్వే ముఖ్యాంశాలు

*    ఏబీపీ-సీఎస్డీఎస్ సర్వే అంచనాల మేరకు బీజేపికి 113నుంచి 121 సీట్లు వస్తాయి.
*    కాంగ్రెస్‌ పార్టీకి 58 నుంచి 64 సీట్లు లభిస్తాయి.
*    బీజేపీకి 47 శాతం ఓటల్‌ షేర్‌, కాంగ్రెస్‌కు 41 శాతం ఓట్‌ షేర్‌ వస్తుందని అంచనా
*    గత సర్వేతో పోలిస్తే బీజేపీ ఓట్‌ షేర్‌ 11 శాతం తగ్గింది. కాంగ్రెస్‌ కు 12 శాతం మేర పెరిగిన ఓట్‌ షేర్‌
*    ఉత్తర గుజరాత్ లోని సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ గణనీయంగా పుంజుకుంది.
*    సౌరాష్ట్ర, కచ్‌ ప్రాంతాల్లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉంది.
*    మధ్య, దక్షిణ గుజరాత్‌లో బీజేపీ పూర్తి మెజారిటీ స్థానాలు సాధించనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gujarat elections  Gujarat  Congress  BJP  Rahul Gandhi  Narendra Modi  Amit Shah  ABP-CSDS  

Other Articles