తమిళనాడు వ్యాప్తంగా రెండు రోజులుగా ఐటీ అధికారులు చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. దివంగత జయలలిత నెచ్చెలి.. అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పన్నుఎగవేత ఆరోపణలతో శశికళ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువర్గానికి సంబంధించిన 147 ప్రాంతాల్లో 1800 మంది ఐటీ సిబ్బంది ఏకకాలంలో దాడులు నిర్వహించారు.
ఈ సందర్భంగా శశికళ సంబంధీకులు పది బోగస్ కంపెనీల పేరిట 1000 కోట్ల రూపాయల పన్నులు చెల్లించకుండా అవకతవకలకు పాల్పడ్డారని ఐటీశాఖ నిర్ధారించినట్లు సమాచారం. బినామీ పేర్లతో 10 బోగస్ సంస్థలను ప్రారంభించిన శశికళ కుటుంబీకులు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడ్డారని ఐటీ వర్గాలు తెలిపాయి. 1996లో శశికళ కుటుంబంపై తొలిసారి ఐటీ దాడులు జరగ్గా.. ఆ సమయంలో జయ అండతో ఆమె తప్పించుకుందనే ఓ వాదన ఉంది.
దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ఇఫ్పుడు మళ్లీ ఈ దాడులు చోటు చేసుకున్నాయి. పెద్ద నోట్ల రద్దు సమయంలో ఈ బోగస్ కంపెనీలు, సొంత వ్యాపారాలు, పార్టీ సంస్థలు, కార్యాలయాల ద్వారా పెద్దఎత్తున నగదుమార్పిడీకి పాల్పడ్డారని ఐటీ అధికారులు తెలిపారు. ఈ అవకతవకల్లో భాగమై, శశికళ డైరెక్టర్ గా ఉన్న ఫెన్సీ స్టీల్, రెయిన్ బో ఎయిర్ ప్రైవేట్ లిమిటెడ్, శుక్రా క్లబ్, ఇండో -దోహ కెమికల్స్ అనే నాలుగు సంస్థలు గత నెల మూసేయడం విశేషం.
స్వాధీనం చేసుకున్నవి...
ఇండో-దోహా కెమికల్స్ సంస్థలో ఇళవరసి, ఆమె బంధువు కులోత్తుంగన్ లు డైరెక్టర్లు. చెన్నైలోని నీలాంగరైలోని శశికళ బంధువు భాస్కరన్ ఇంట్లో లెక్క చూపని 7 కేజీల బంగారాన్ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆపై కొన్నిచోట్ల డైమండ్లను స్వాధీనం చేసుకోగా.. వాటికి చిన్నమ్మ బంధువులకు సంబంధం ఉన్నట్లు తేల్చారు. మన్నార్ గుడిలో శశికళ సోదరుడు దివాకరన్ నిర్వహిస్తున్న సెంగమళతాయార్ మహిళా కళాశాల విడిది గృహంలో 25 లక్షల రూపాయల నగదు, 6 రోలెక్స్ గడియారాలు, బంగారం, తదితరాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక శశికళకు చెందిన 315 బ్యాంకు ఖాతాలనూ స్తంభింపజేసినట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more