అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ పర్యటనల్లో అగ్రరాజ్య భద్రతా సిబ్బంది చేసే హాడావిడి అంతాఇంతకాదు. అది ఏ దేశమైనా అక్కడ మొత్తం భద్రతను తమ అదుపాజ్ఞల్లోకి తీసుకోవడం వారికి అలవాడు. ఇదే తరహా షరతులు ఇప్పుడు భారతీయ అధికారుల ముందుకు పెడుతుంది అమెరికా. అదేంటి ట్రంప్ దేశ పర్యటనకు వస్తున్నాడా అంటే అదేం లేదు. కానీ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ భారతదేశంలో అందులోనూ హైదరాబాద్ మహానగరానికి వస్తున్నారు. దీంతో అమె భద్రత చర్చనీయాంశంగా మారింది.
దీంతో భారత పర్యటనకు ఇవాంక రావాలంటే అంటూ షరుతులు పెట్టేస్తున్నారు వైట్ హౌజ్ భద్రతాధికారులు. ఇవాంక భద్రతను తమకు వదిలేయాలని.. ఆమె సెక్యురిటీ అంతా తాము చూసుకుంటామంటూ కేంద్ర హోంశాఖతో పాటు ఎస్పీజీ స్పష్టమైన హామీలను ఇచ్చినా.. అందుకు ససేమిరా అంటుందో అగ్రరాజ్యం. తమ భద్రతాధికారులు ఇవాంక రాకకు ముందుగానే వచ్చి.. పర్యటన ముగిసిన తరువాత తిరిగి వెనక్కి వచ్చేస్తారని తేల్చిచెబుతుంది. ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్ లో ఇవాంక పర్యటించనున్నారు. హెఐసిసిలో జరిగే ప్రపంచ పారిశ్రామిక సదస్సులో అమె పాల్గోననున్నారు.
ఇవాంక ముందు ఆయుధాలు వద్దు..
అయితే ఇవాంక పర్యటన నేపథ్యంలో అమె భద్రతను యుఎస్ అధికారులు చూసుకుంటారని వదిలేస్తే.. ఇక్కడే మరో పేచీ వచ్చి పడింది. ఈ సదస్సుకు హజరయ్యుందుకు వచ్చే అమె ఎదుట మన పోలీస్ అధికారులు, సిబ్బంది ఆయుధాలతో ప్రవేశించేందుకు వీల్లేదని అమెరికా సెక్యూరిటీ వింగ్ స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే ఇవాంక ట్రంప్ భద్రతతో పాటు దేశ ప్రధాని మోడీ భద్రత కూడా ముఖ్యమని, ఆయన వెనక ఆర్మ్ డ్ సిబ్బంది ఉండాలని కేంద్ర హోంశాఖ చెబుతుంది. గతంలో టర్కీలో జరిగిన హైకమిషనర్ కాల్పుల వ్యవహారంతో అమెరికన్ సెక్యూరిటీ సదస్సులోకి ఎవరూ ఆయుధాలు తేవద్దన్న నిబంధనను పెడుతున్నట్టు కేంద్ర హోంశాఖ భావిస్తోంది.
ఇవాంక ట్రంప్ భద్రత అమెరికన్ సెక్యూరిటీయే చూసుకుంటుందని, ప్రత్యేకంగా వాహనాలు, సిబ్బందిని రంగంలోకి దించనున్నట్టు సమాచారం. సదస్సు బయటే ఎస్పీజీ, కేంద్ర రాష్ట్ర పోలీస్ బలగాలు భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని శ్వేతసౌదం అధికారులు కేంద్ర హోంశాఖకు స్పష్టం చేసినట్టు రాష్ట్ర పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో కేంద్ర హోంశాఖ, ఇంటెలిజెన్స్ బ్యూరో, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులు త్వరలోనే రాష్ట్రంలో పర్యటించి భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర వర్గాలు తెలిపాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more