గుజరాత్ ఎన్నికలకు లౌకికవాద పార్టీలన్ని సమైక్యంగా బీజేపిని ఓడించేందుకు జతకట్టాల్సిన అవసరముందని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపి) అధ్యక్షుడు శరద్ పవార్ ప్రటించిన మరుసటి రోజునే ఆ పార్టీకి చెందిన కీలక నేత ప్రఫూల్ పటేల్ మాత్రం తాము గుజరాత్ ఎన్నికలలో ఒంటరిగానే పోరాడదల్చుకున్నామని కుండబద్దలు కొట్టారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో అనుసరించిన మార్గానే గుజరాత్ ఎన్నికలలో కూడా ఫాలో అవుతామని చెప్పారు.
తమ మిత్రుడిగా భావిస్తున్న కాంగ్రెస్ తమకు అశించిన సంఖ్యలో సీట్లను కేటాయించడం లేదని, తాము గుజరాత్ లో కాంగ్రెస్ తో కలసి పెరిగేందుకు మోకాలడ్డుతుందని ఆయన ఆక్షేపించారు. దీంతో కాంగ్రెస్తో కలిసి మిత్రపక్షంగా బరిలో దిగుతామని భావించినా.. చివరకు తాము ఒంటిరగానే బరిలో దిగుతామని ఇవాళ నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ఓ ప్రకటన వెలువరించింది.
గత ఎన్నికలలో తమకు ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వున్నారని, కాగా మరికొందరు స్వల్ప ఓట్లతేడాతో ఓటమిని చవిచూశారని, దీంతో తమకు కనీసం 10 అసెంబ్లీ స్థానాలైనా కేటాయించాలని కాంగ్రెస్ ను కోరితే కేవలం నాలుగు సీట్లను మాత్రమే ఇస్తామని తేగేసి చెప్పడంతో పాటు తమకు ఓ వైపు చర్చలు సాగుతున్న క్రమంలో అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంపై కూడా అయన అగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తాము సొంతంగా పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
దేశ ప్రధాని నరేంద్రమోడీకి చెందిన రాష్ట్రం కావడంతో ఇక్కడి ఎన్నికలపై యావత్ ప్రపంచం దృష్టి కేంద్రీకరించబడి వుందని అన్నారు. అయితే గుజరాత్ కు చెందిన ఓ కాంగ్రెస్ నేత మాట్లాడుతూ.. గుజరాత్ లో ఎన్సీపికి బలమే లేదని అన్నారు. ఇక ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికలలో సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ కు ఎన్సీపికి చెందిన ఓ ఎమ్మెల్యే ఓటు వేయలేదని, అత్యంత కీలకసమయాల్లో మిత్రధర్మం మర్చిపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. కాగా డిసెంబర్ 9, 14 తేదీల్లో రెండు దఫాలుగా గుజరాత్ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more