అగ్రరాజ్య అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతరు ఇవాంక ట్రంప్ హైదరాబాద్ నగరంలో పర్యటించనున్న నేపథ్యంలో నగరాన్ని యాచకులు లేని నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం.. ఎక్కడ యాచకుటు కనపించినా వారిని జైళ్లకు తరలించేస్తున్నారు. ఇలా యాచకులుగా మారిన వారి బంధువులను రప్పించి.. వారికి అప్పగిస్తున్నారు. ఇలా ఎవరు రాని యాచకులు మాత్రం ఇవాంక పర్యటన ముగిసేంత వరకు జైళ్లలోనే వుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో బెగ్గర్ ఫ్రీ సిటీ కార్యక్రమాన్ని చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలుసుకున్నారు.
అచ్చంగా టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన బిచ్చగాడు చిత్రం తరహాలో ఓ ఇద్దరు మహిళలు యాచకవృత్తిని ఎంచుకున్నారు. మెహదీపట్టణంలోని ఓ దర్గా వద్ద బిక్షాటన చేస్తున్న వారిని పోలీసులు నవంబర్ 11న చర్లపల్లి ఆనంద ఆశ్రమానికి తరలించారు. అయితే ఈ బిచ్చగాళ్లలో చక్కని ఇంగ్లీష్ మాట్లాడుతున్న ఇద్దరి మహిళలను చూసి జైలు అధికారులు అవాక్కయ్యారు. దీంతో వారి పూర్తి వివరాలు తెలుసుకున్న పోలీసులు కోట్లకు కోట్ల ఆస్తి ఉండి.. విదేశాల్లో ఉద్యోగాలు చేసిన మహిళలని తెలుసుకోని ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ వివరాలు.. ఫర్జానా, రబియా బసీరా అనే మహిళలు గత కొద్దిరోజులుగా లంగర్ హౌస్లో భిక్షాటన చేస్తూ జీవితం సాగిస్తున్నారు.
హైదరాబాద్ ఆనంద్ బాగ్ కు చెందిన ఫర్జానా(50) ఏంబీఏ చదివింది. లండన్ లో అకౌంట్స్ ఆధికారిగా కూడా పనిచేసింది. రెండేళ్ల క్రితం భర్త చనిపోయాడు. ఆ తర్వాత ఆర్కిటెక్చర్ అయిన కుమారుడి దగ్గర ఉండేది. అనారోగ్యానికి గురైన ఫర్జానా. ఓ బాబాను సంప్రదించింది. వ్యాధి తగ్గాలంటే దేవుడి దయ ఉండాలని, దర్గా వద్ద భిక్షాటన చేయాలని సూచించడంతో మరోమార్గం లేక యాచక వృత్తిని ఎంచుకుంది. తల్లిని వదిలించుకోవాలనే ఫర్జానా కొడుకు పన్నిన పథకమిదన్న అరోపణలు వున్నాయి.
రబియా బసీరాకు అమెరికా గ్రీన్ కార్డ్ కూడా ఉంది. గతంలో అమెరికాలో ఉపాధ్యాయురాలిగా కూడా పనిచేసింది. నగరంలో కోట్లకు కోట్ల ఆస్తి ఉంది. బంధువులతో కలిసి ఉండాలని హైదరాబాదులోనే ఉంటుంది. కొన్నాళ్ల క్రితం భర్త చనిపోయాడు. తనకు అండగా ఉన్న కూతురు కూడా కన్ను మూసింది. కోడుకులు, బంధువులు మోసం చేసి ఆస్తి లాక్కొని ఒంటరిదాన్ని చేశారని దీంతో అమె దర్గా వద్ద బిక్షాటన చేస్తుందని తెలిసింది. అయితే రబియా మాత్రం తనకు మనశ్శాంతి కావాలని.. దానిని కోరుకునేందుకే తాను యాచిస్తున్నానని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more