hemanta biswas controversial statement on cancer క్యాన్సర్ పై మూడవిశ్వాసాలు ప్రబలేలా మంత్రి వ్యాఖ్యలు

Assam health minister hemanta biswas sharma controversial statement on cancer

himanta biswa sarma, himanta sarma cancer comment, himanta biswa sarma cancer comment, assam minister cancer comment, P Chidambaram, Congress, Cancer, Sin, BJP, Assam

HealthMinister of Assam and a senior BJP leader, Sarma said that people suffer from life-threatening diseases such as cancer because of sins committed in the past.

క్యాన్సర్ పై మూడవిశ్వాసాలు ప్రబలేలా మంత్రి వ్యాఖ్యలు

Posted: 11/23/2017 04:27 PM IST
Assam health minister hemanta biswas sharma controversial statement on cancer

ఆయనో ఓ రాష్ట్రానికి మంత్రి.. అమాత్యుని బాధ్యతలు నెరవేస్తున్న ఈయన గారు మంత్రాలకు చింతకాయలు రాలుతాయని మరోమారు వాదిస్తున్నారు. ఎంతలా అంటే ప్రజల్లో మూడనమ్మకాలపై మరింత విశ్వాసం పెంచెలా..? తప్పు చేస్తే శిక్ష తప్పదు అన్నది అందరికీ తెలిసిన విషయమే.. అయినా.. తప్పు చేస్తేనే ప్రాణాంతక వ్యాధులు చెప్పడం మాత్రం మూడనమ్మకమే. మంత్రి పదవిలో ఉన్న ఈయన విచక్షణ మరిచి సరిగ్గా అలాంటి వ్యాఖ్యలు చేశారు.

ప్రజల్లో మూఢనమ్మకాలను పారదోలాల్సిన మంత్రివర్యులే వాటిని బలపరుస్తున్నారు. వారి ఆరోగ్యం పట్ల చైతన్యం కల్పించాల్సిన ఆరోగ్య శాఖ మంత్రి.. మనుషులకు వచ్చే వ్యాధులపై నిర్లక్ష్యంగా మాట్లాడారు. ఈ వ్యాక్యలు చేసిందెవరని అంటారా..? అస్సాం ఆరోగ్య మంత్రి హిమంత బిస్వా శర్మ. ఏమన్నారో తెలుసా..? కేన్సర్ వ్యాధి రావడానికి కొత్త కారణాలు చెప్పుకొచ్చారు.
 
ఎవరైనా తమ బాధ్యతల నుంచి తప్పించుకోవడం పెద్ద పాపం అని.. అలాంటి పాపం చేసిన వారిని దేవుడు క్షమించబోడని అన్నారు. పాపాలు చేయడం వల్లే కేన్సర్ వస్తుందంటూ..  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి వ్యాఖ్యలపై ఆ రాష్ట్రంలోనేకాక.. దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆరోగ్య మంత్రిగా విఫలమైనందుకే ఆయన ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేస్తున్నారంటూ అస్సాంలోని ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. మంత్రి వ్యాఖ్యలు కేన్సర్ బాధితులను మరింత బాధపెట్టేవిగా ఉన్నాయన్నారు.
 
మరోవైపు తనపై వస్తున్న విమర్శలపై స్పందించిన మంత్రి మహంత తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తాను హిందువునని, హిందూ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానని అన్నారు. తన తండ్రి కూడా కేన్సర్ కారణంగానే చనిపోయారని గుర్తుచేసిన ఆయన.. పాపాల కారణంగానే తన తండ్రికి కేన్సర్ వచ్చిందేమోనని అన్నారు. కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులు తమ బాధ్యతలను విస్మరించకూడదనే ఉద్దేశంతోనే ఆ వ్యాఖ్యలు చేసినట్లు చెప్పుకొచ్చారు.

అయితే మంత్రి వ్యాఖ్యలపై మహిళలు మరింత అగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహిళల్లో అత్యధిక మంది సెర్వికల్ క్యాన్సర్ బారిన పడుతున్నారని, వారి గైనికాలజీ సమస్యలతో గర్భసంచి తొలగించిన మహిళలందరూ తప్పక క్యాన్సర్ బారిన పడుతారని అన్నారు. అయితే కొన్న్ దశాబ్దాల క్రితం ఈ క్యాన్సర్ కు వాక్సిన్ కూడా కనుగోనలేదని, అయితే ఇప్పుడు పుట్టే పిల్లలు పుణ్యాత్ములు, దశాబ్దాల క్రితం క్యాన్సర్ పోకిన మహిళలందరూ పాపాత్ములుగా పరిగణిస్తారా..? ఇదేనా మంత్రి కర్మ సిద్దాంతమని ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Himanta Biswa Sarna  P Chidambaram  Congress  Cancer  Sin  BJP  Assam  

Other Articles