అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, ఆయన ప్రభుత్వ సలహాదారు ఇవాంక ట్రంప్ ఇవాల తెల్లవారు జామున భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్ మహనగరానికి చేరుకున్నారు. ఇవాళ అమె శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగానే అమెకు రాష్ట్ర ప్రభుత్వం తరపున్న ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పోలీస్ ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో హై సెక్యూరిటీ కాన్వాయ్ తో ఇవాంక మాదాపూర్ ట్రైడెంట్ హోటల్ కు చేరుకున్నారు.
ఎయిర్ పోర్టులో సిఐడి ఐజీ షికా గోయెల్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇవాంకతో పాటు సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన వీఐపీలు, వీవిఐపీలులకు ఘనంగా స్వాగతం పలికారు అధికారులు. వారిని భారీ భద్రత మధ్య సిటీలోని స్టార్ హోటళ్లకు తీసుకెళ్లారు. ఇక ట్రైడెంట్ హోటల్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు హెచ్ఐసిసికి చేరుకుంటారు. తర్వాత హెచ్ఐసిసిలోని సెకండ్ ఫ్లోర్లో భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తో ఇవాంక ట్రంప్ భేటీ అవుతారు.
అగ్రరాజ్య ప్రభుత్వ సలహాదారు హోదాలో అమె తొలిసారిగా భారత పర్యటనకు వచ్చిన నేపథ్యంలో అమెకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి అతిథ్యమిచ్చి చిరకాలం గుర్తిండిపోయేలా అతిథ్యమివ్వనుంది. అందుకు చారిత్రాత్మకమైన ఫల్ నుమా ఫ్యాలెస్ కూడా అందంగా ముస్తాబు చేయించారు. ఇవాంకా ట్రంప్ రెండు రోజుల పర్యటనలో తొలిరోజున అమె ప్రపంచ పారిశ్రామికవేత్తల సమావేశంలో, తెలంగాణ ప్రభుత్వ విందులో పాల్గననున్నారు.
ఇక రెండో రోజు కూడా అమె ట్రైడెంట్ హోటల్ లో ఔత్సాహిక మహిళా పారిశ్రమిక వేత్తలతో భేటీ కానున్నారు. అంతకుముందు అమె పారిశ్రామిక వేత్తల సదస్సుకు హాజరవుతారని సమాచారం. ఆ తరువాత అమె హైదరాబాద్ నగరాన్ని పర్యటిస్తారు. అయితే అమె చార్మినార్ వంటి చారిత్రాత్మక ప్రాంతాలను సందర్శిస్తారని తెలుస్తుంది. ఇందుకోసం అమె తన పర్యటనలో కొంత సమయాన్ని రిజర్వు చేసుకున్నారని సమాచారం. ఇక ఇవాంక ఇక్కడి గాజులను కొంటారన్న వార్తలు కూడా తెరపైకి రావడంతో అమెకోసం అనేక కొత్త వెరైటీ గాజులను తయారు చేయించి సిద్దం చేశారు పాతబస్తీలోని దుకాణాదారులు. ఇక రేపు బుధవారం సాయంత్రం 5:35 గంటల ప్రాంతంలో శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరి తిరుగు పయనం కానున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more