అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంక ట్రంప్ అన్నారు. కొత్త ఆవిష్కరణలకు ముందుకొస్తున్న యువతకు తాను మనస్పూర్తిగా స్వాగతం పలుకుతున్నాని తెలిపారు. ఇన్నోవేషన్ హబ్‌గా హైదరాబాద్ ఎదుగుతోందని కొనియాడారు. హైటెక్స్ లోని హెచ్ఐసీసీలో ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు. ప్రారంభించన అనంతరం అమె ప్రసంగిస్తూ.. భారత అంతరిక్ష విజ్ఞానం చంద్రుడిని దాటి మార్స్ దాకా వెళ్లిందన్నారు.
కొత్త ఆవిష్కరణలతో వస్తున్న ఔత్సాహికులు విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్నారని అలాంటి.. ఔత్సాహిక వ్యాపారవేత్తలు కాంక్ష వదలకుండా నిరంతరం పని చేయాలి అమె సూచించారు. భారత్ అమెరికాకు నిజమైన మిత్రుడని అధ్యక్షుడు ట్రంప్ చెబుతుంటారని.. అందమైన భారత దేశానికి వచ్చే అవకాశం తమకు దక్కిందని అమె అన్నారు. భాగ్యనగరానికి ముత్యాల నగరంగా కూడా పేరుందని అయితే ప్రస్తుతం ఈ నగర యువతే గొప్ప సంపదని అమె కొనియాడారు.
ఆసియాలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌గా టి-హబ్ తయారైందని ప్రశంసించిన అమె.. ఈ సదస్సులో 52శాతం మహిళలు పాల్గొనడం తనకు గర్వకారణంగా ఉందన్నారు. పురుషాధిక్య సమాజంలో రాణించాలంటే మహిళలు మరింత కష్టపడాలని తాను తెలుసుకున్నానన్నారు. గత పదేళ్లలో మహిళా పారిశ్రామిక వేత్తల సంఖ్య 10శాతం పెరిగిందని చెప్పారు. ఇప్పుడు అమెరికాలో కోటీ 10 లక్షలమంది మహిళా పారిశ్రామిక వేత్తలు ఉన్నారని అన్నారు.
ఒక్క మహిళ నిలబడితే కుటుంబం, సమాజం, వ్యవస్థలు నిలబడతాయని తాను కూడా విశ్విసస్తానని అన్నారు. మా నాన్న అధ్యక్షుడైన తర్వాత వ్యాపారాలను వదిలి సహాయ సహకారాలు అందించేందుకు రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకోచ్చారు. గత దశాబ్దంలో నూతన ఉత్పత్తుల రూపకల్పనలో మహిళలు ఎంతో ముందడుగు వేశారన్నారు. ఎంతో మంది మహిళలు ఉత్పాదక రంగంలోకి దూసుకొస్తున్నారని అన్నారు. గత దశాబ్దంలో మహిళా పారిశ్రామికవేత్తలు 90లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని ఇది అభినందించాల్సిన విషయమని అన్నారు. ఈ సందర్భంగా అమె ప్రధాని నరేంద్రమోడీపై కూడా ప్రశంసలు కురిపించారు.
భారత్, అమెరికా దృఢమైన సంబంధాలకు హైదరాబాద్ ప్రతీక అన్నారు ప్రధాని నరేంద్రమోడీ. హెచ్ఐసిసిలో నిర్వహించిన గ్లోబల్ ఎంట్రపెన్యూర్ సదస్సులో మాట్లడిన మోడీ… దక్షిణాసియాలో ఈ సదస్సు జరగడం ఇదే మొదటి సారని అది తమ దేశంలోని హైదరాబాద్ లో అమెరికా భాగస్వామ్యంతో నిర్వహించడం గర్వంగా వుందని అన్నారు. ఎంట్రపెన్యూర్స్, ఇన్వెస్టర్లను ఒకే వేదికపైకి తీసుకురావడం చాలా ఆనందంగా ఉందన్నారు.
మహిళలకే తొలి ప్రాధాన్యత అన్నది భారత చరిత్ర.. సంస్కృతిలో భాగమన్నారు. భారత పురాణాల్లో మహిళలు శక్తికి ప్రతీకలన్నారు. ఝాన్సీ లక్ష్మీభాయ్ లాంటి వీరనారీమణులు మనకు ఆదర్శమన్నారు. నేటి భారత మహిళా యువతరం కూడా క్రీడల్లో రాణించి దేశానికి పేరు ప్రఖ్యాతులను తీసుకువస్తున్నారని అన్నారు. మరీ ముఖ్యంగా పివీ సింధూ, సైనా నెహ్వాల్, సానియా మిర్జాలు హైదరాబాద్ నుంచే దేశం తరపున ప్రతినిథ్యం వహించి ఎన్నో విజయాలను అందించారని కోనియాడారు.
ఆయుర్వేదం, యోగా భారత్ ప్రపంచానికి అందించిన ఆవిష్కరణలన్నారు. డిజిటల్, లైఫ్ సైన్సెస్, ఫైనాన్షియల్ టెక్నాలజీ, మీడియా, ఎంటర్ టైన్ మెంట్ లో కొత్త అవకాశాలన్నారు. కల్పనాచావ్లా, సునీతా విలియమ్స్ భారత మహిళా మేధోశక్తికి నిదర్శనమన్నారు. వ్యవసాయ రంగంలో 50శాతం భాగస్వామ్యం మహిళలదేనన్నారు. ఇక తమ ప్రభుత్వం కూడా మహిళలకు ముద్ర బ్యాంకు ద్వారా అనేక రుణాలను అందించామని చెప్పారు. మహిళా సాధికరారతకు, స్వాలంభనకు తమ ప్రభుత్వం కట్టుబడి వుందని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more