RK Nagar bypoll: Madhusudanan is AIADMK candidate అర్కేనగర్ ఉపఎన్నికల బరిలో పాత అభ్యర్థులే

Rk nagar by poll tough fight between madhusudanan marudhu ganesh dinakaran

RK nagar, J Jayalalithaa, sasikala, bypoll, AIADMK, DMK, ttv dinakaran, madhusudhanan, maradhu ganeshan, tamil nadu, tamil politics

The ruling AIADMK in Tamil Nadu on Thursday nominated party presidium chairmanpol for R K Nagar bypoll, the seat that fell vacant

అర్కేనగర్ ఉపఎన్నికల బరిలో పాత అభ్యర్థులే

Posted: 11/30/2017 04:19 PM IST
Rk nagar by poll tough fight between madhusudanan marudhu ganesh dinakaran

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్ లో మరోమారు ఉప ఎన్నిక నగారా మ్రోగడంతో.. అధికార పార్టీ లోని రెండు ప్రధాన ప్రత్యర్థి వర్గాలతో పాటుగా ప్రధాన విఫయ పార్టీకి చెందిన అభ్యర్థి పోటీపడుతుండంటంతో ఇక ఉపఎన్నిక కూడా రసవత్తరంగా మారింది. అర్కేనగర్ ఉపఎన్నికలో విజయం సాధించి తామే అమ్మకు నిజమైన వారసులమని అర్కేనగర్ ప్రజలు నమ్మారన్న విషయాన్ని రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని అధికార పార్టీలోని శశికళ వర్గం భావిస్తుంది.

ఇక తమిళనాడులోనే ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించి.. అమ్మ నియోజకవర్గం నుంచే తాము గెలిచామని, రానున్న ఎన్నికలలో రాష్ట్ర ప్రజల తీర్పు కూడా ఇదేనని చెప్పాలని విపక్ష డీఎంకే పార్టీ వ్యూహాలు రచిస్తుంది. ఇక అధికారంలో వున్న ఈఫీఎస్ ఓపీఎస్ వర్గం మాత్రం తామే అమ్మకు అసలైన వారసులమని ప్రజలు అంగీకరించారని అంటోంది. అమ్మ ఆశయాల దిశగా తమ పాలనను సాగిస్తున్నామని.. అన్నడీఎంకేలోని అధికార వర్గం వాదిస్తుంది.

ఎన్నికల సంఘం కూడా తామే అమ్మకు అసలైన వారసులం అని నమ్మి.. రెండాకుల గుర్తును కూడా తమకే కేటాయించిందని అక్కడే నైతిక విజయాన్ని అందుకున్నామాని అంటోంది. ఇక అర్కే నగర్ ఎన్నికలలో తమ అభ్యర్థి మధుసూధన్ నిస్పందేహంగా విజయాన్ని అందుకుంటారని ధీమా వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలో వచ్చే నెల 21న జరిగే అర్కేనగర్ ఉప ఎన్నికలో ఈ ముగ్గురు మధ్య హోరాహోరీ పోరు తప్పదని తెలుస్తుంది.

ఇప్పటికే ప్రధాన పార్టీలు ఉపఎన్నికల కోసం తమ అభ్యర్థులను ప్రకటించాయి. అయితే ఇదివరకు పన్నీరు సెల్వం క్యాంపు నుంచి అబ్యర్థిగా పోటీచేసిన మధుసూదనన్ ఇక అధికార అన్నాడీఎంకే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. అయితే శశికళ వర్గం నుంచి అమె మేనల్లుడు టీటీవీ దినకరన్ కూడా అధికార వ్యతిరేక వర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇక డీఎంకే నుంచి మరుదు గణేశ్‌ బరిలో నిలుస్తున్నారు. అయితే వీరు ముగ్గురూ గత ఉపఎన్నికల సందర్భంగా స్థానిక ప్రజలకు పరిచయమైన వారే కావడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles