Journalist shot dead in Uttar pradesh ఉత్తర్ ప్రదేశ్ లో మరో ప్రాతికేయుడి దారుణ హత్య

Journalist naveen srivastava shot dead in bilhaur

attack on journalist, naveen attack on journalist , journalist up attack, journalist shot dead, injured journalist died in hospital, bike born assailants, scibe shot dead in bulhur, journo shot dead in kanpur, journalist shotdead in uttat pradesh, journalist, journalist KJ singh mohali, gouri lankesh bangalore, naveen srivastava kanpur, crime

Attacks on journalists continue as another one was shot dead in Bilhur, Kanpur by unidentified bike-borne assailants. The journalist was identified Naveen and he succumbed to his injuries while being taken to a hospital after he was shot.

ఉత్తర్ ప్రదేశ్ లో మరో ప్రాతికేయుడి దారుణ హత్య

Posted: 12/01/2017 01:30 PM IST
Journalist naveen srivastava shot dead in bilhaur

నిజాలను నిర్భయంగా ప్రజలకు తెలియజేసే పనిలో భాగంగా తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేస్తున్న పాత్రికేయులపై హత్యలు కొనసాగుతూనే వున్నాయి. సరిహద్దులో శత్రుసేనలతో పోరాడుతున్న జవాన్ల మాదిరిగానే సమాజంలోని నిజానిజాలను ప్రజలకు తెలియజేస్తున్న జవాన్లుగా కీర్తింపడే పాత్రికేయులపై అగంతకులు విరుచుకుపడుతూనే వున్నారు. సెప్టెంబర్ మాసంలో బెంగళూరులో సినియర్ పాత్రికేయురాలు సామాజిక కార్యకర్త గౌరీ లంకేష్ దారుణ హత్యతో రేగిన అందోళనలు చల్లారకముందే పంజాబ్ లోని మొహాలిలో కేజీ సింగ్ అనే పాత్రికేయుడు, అతని తల్లిపై అగంతకుడు దాడి చేసి చంపేశారు.

ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ లో మరో జర్నలిస్టు హత్యకు గురయ్యారు. ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేష్ హత్య తరహాలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. కాన్పూర్ లోని బిల్హార్ ప్రాంతానికి చెందిన నవీన్ శ్రీవాస్తవ అనే జర్నలిస్టుపై బైక్ పై వచ్చిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లుగా కాన్పూర్‌ నగర్‌ ఎస్ఎస్పి తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీవాస్తవ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారని పేర్కొన్నారు. నిందితుల కోసం గాలిస్తున్నామని, సాధ్యమైనంత త్వరలో వారిని పట్టుకుంటామని ఆయన చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు నిర్వహించాలని యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ డిజిపిని ఆదేశించినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KJ singh  gouri lankesh  naveen srivastava  journalist  kanpur  crime  

Other Articles