తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఆమె వైవాహిక బంధం గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. అమ్మ వారసులమంటూ ఓ కొడుకు ఇప్పటికే కోర్టు చేత మొట్టికాయలు వేయించుకోగా.. తాను జయ కూతరినేనంటూ బెంగళూరుకు చెందిన అమృత కూడా న్యాయస్థానాన్ని అశ్రయించి భంగపడ్డారు. అయితే జయలలితకు అమ్మాయి వుందన్న విషయం మాత్రం ఇప్పుడు నిజమని స్పష్టమైంది. జయ మేనకోడలు దీపా జయకుమార్ కూడా తమ మేనత్తకు ఆడపిల్ల వుందన్న విషయం వాస్తవమేనని అన్నారు. ఇక తాజాగా జయ మేనత్త కూతురు లలిత కూడా ఇదే అంశాన్ని నిజమని ప్రస్తావనకు తీసుకురావడంతో తమిళనాడులో ఇప్పుడిదే అంశం హాట్ టాపిక్ గా మారింది.
నిప్పులోన కాలదు, నీటిలోన మునగదు, గాలిలోన అరదు నిజం సత్యమన్న పెద్దలు మాటలు మాత్రం వాస్తవమని స్సష్టం చేస్తూ పుట్టకుముందు నుంచి అజ్ఞతవాసాన్ని ఎదర్కొంటున్న జయ కూతురికి అమె మరణంతోనైనా అది వీడిపోవాలని కోరుకోని తమిళుడు లేడంటే అతిశయోక్తి కాదు. జయకు, నటుడు శోభన్ బాబుకు పుట్టిన సంతానాన్ని న్యాయస్థానాలు నిర్థారించాలని కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే అమృతే జయ కూతుర్న విషయాం ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా అమ్మ అభిమానులు విశ్వసిస్తున్నారు. ఇదే విషయాన్ని జయ స్నేహితురాలు కూడా తెలిపారు. ఈ విషయాన్ని శోభన్ బాబే తనతో స్వయంగా చెప్పారని పేర్కొన్నారు.
అయితే తాజాగా జయలలిత-శోభన్ బాబుల మద్యన నడుస్తున్న సహజీవనాన్ని వేలెత్తి చూపుతూ ఓ అంగ పత్రిక ప్రచురించిన కథనంపై అమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై అప్పట్లోనే అమె స్టార్ అండ్ స్టైల్ పత్రిక సంపాదకవర్గానకిి ఓ ఘాటు లేఖను రాసింది. శోభన్ బాబుతో తాను సహజీవనం చేస్తున్నానని, ఆయన వివాహితుడు కావడంతో పెళ్లి చేసుకోలేకపోతున్నానని 1979లోనే జయలలిత అంగీకరించి.. తమ మధ్య వున్నది అత్యంత పవిత్ర బంధమని.. దానిని చులకనగా చూడటం కానీ వెలెత్తి చూపడం కాని సముచితం కాదని కోరింది.
ఈ లేఖ ఆ తరువాత వెలుగులోకి రావడంతో ఓ తమిళ పత్రిక కూడా దీనిని అనువదించి కథనాన్ని ప్రచురించింది. ఆ పాత్రికేయుడిని కూడా తన వద్దకు పిలిపించుకన్న జయలలిత.. పెళ్లైన తరువాత ఎవరు ఎన్ని వెదవ వేషాలు వేసినా చెల్లబాటు అవుతాయి కానీ పెళ్లి కాకుండా తాము అత్యం పవిత్రంగా ఓ బంధాన్ని ఏర్పర్చుకుంటే మాత్రం తప్పా అని నిలదీసింది. ఈ విషయం ఇప్పుడు బయటకు రావడంతో అమృత ఆమె కూతురే అన్న అనుమానాలు బలపడుతున్నాయి. అంతేకాదు.. జయలలితకు కూతురు ఉన్న మాట వాస్తవమేనని జయ మేనత్త కూతురు లలిత కూడా చెప్పడం గమనార్హం.
అమృత పిటిషన్ను తోసిపుచ్చిన అత్యున్నత న్యాయస్థానం ఈ విషయాన్ని కర్ణాటక హైకోర్టులో తేల్చుకోవాలని సూచించింది. కోర్టులో ఆమె దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం.. ఆగస్టు 14, 1980లో జయలలితకు అమృత జన్మించారు. పెంపుడు తల్లి శైలజ 2015లో, తండ్రి ఈ ఏడాది మార్చి 20న మృతి చెందారు. జన్మనిచ్చిన తల్లి బతికి ఉన్నప్పుడు తాను కుమార్తెనని ప్రకటిస్తే ఆమె కీర్తి ప్రతిష్ఠలు దెబ్బతింటాయని భావించి ఇన్నాళ్లు దాచిపెట్టినట్టు అమృత పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశంతో అమృత ఇప్పుడు కర్ణాటక కోర్టు మెట్లు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more