Vishal Files Nomination For RK Nagar by-Poll అర్కేనగర్ బరిలో విశాల్.. మాజీలకు ఘననివాళులు..

Hero vishal files nomination papers for rk nagar by poll

Kollywood, Vishal, Rajinikanth, Kamal haasan, Nadigar Sangam,, Rk nagar by election, By polls, Vishal files nomination, Jayalalithaa, AIADMK, Tamil nadu politics

Actor Vishal, who filed his nomination papers for the RK Nagar bypoll, paid his respects to late AIADMK Supremo J Jayalalithaa, at her memorial before filing his nomination at the RK Nagar election office.

అర్కేనగర్ బరిలో విశాల్.. మాజీ సీఎంలకు ఘననివాళులు..

Posted: 12/04/2017 03:08 PM IST
Hero vishal files nomination papers for rk nagar by poll

తమిళనాడు రాజకీయాలలోకి త్వరలోనే ఎంట్రీ ఇస్తానని అటు సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించిన తరువాత ఇటు విలక్షణ నటుడు కమల్ హాసన్ కూడా తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని అధికార పార్టీపై కూడా అయన విమర్శలు చేశారు. అయితే వీరిద్దరికన్నా ముందు తెలుగు కుర్రాడు విశాల్ చడీచప్పుడు లేకుండా ఎంట్రీ ఇచ్చేశాడు. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ నియోజకవర్గానికి బరిలో నిలుస్తున్నాడు.

హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే విశేషాభిమానులను చూరగొన్న విశాల్ ఇప్పుటికే చిత్రసీమ రంగంలో తనదైన ముద్రను వేసుకున్నాడు. నడియార్ సంఘం కార్యదర్శిగా, తమిళ చిత్రపరిశ్రమ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా పలు పదవులను అలంకరించిన విశాల్.. ఇక తాజాగా  రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి.. అక్కడ కూడా విజయాన్ని అస్వాధించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇటీవల బీజేపి జాతీయ నాయకుడు రాజా తాను మోర్సల్ చిత్రం పైరసీ సీడిని చూశానని చెప్పడంతో విశాల్ అగ్రహాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిపిందే.

ఆ తరువాత విశాల్ కార్యాలయాలపై తొలుత ఐటీ దాడులు, ఆ తరువాత జీఎస్టీ దాడులు జరిగాయన్న వార్తలు కూడా వినిపించాయి. అయితే తాము ఎలాంటి దాడులు చేయలేదని అక్కడి అధికారులు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే దాడులు జరిగినట్లు.. అధికారులకు తాను లెక్కలను చూపుతున్నట్లు విశాల్ నిల్చోన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కేంద్రానికి వ్యతిరేకంగానే విశాల్ ఈ ఎన్నికల బరిలో నిల్చోనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ నెల 21న అర్కే నగర్ ఎన్నికలకు జరగనున్న ఉప ఎన్నికల బరిలో విశాల్ ఎంట్రీ అప్పుడే వేడిని రాజేసింది. విశాల్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పటికీ జయలలిత సానుభూతిపరుల ఓట్ల కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగా ఆయన ఏకంగా జయలలిత స్మృతివనం వద్దకు వెళ్లి ఆయన ఘనంగా నివాళులు అర్పించారు. అంతేకాదు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు సీఎన్ అన్నాదురయ్, కె కామరాజ్, ఎంజీ రామచంద్రన్ లకు కూడా నివాళులు అర్పించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles