BJP and Congress neck-and-neck in Gujarat గుజరాత్ కాంగ్రెస్ లో జోష్ నింపిన తాజా ఎన్నికల సర్వే

Congress likely to give neck and neck fight to bjp in gujarat survey

Gujarat elections, BJP, Congress, votebank politics, caste politics, Patidars, OBCs, Dalits, urban votebank, rural votebank, Gujarat Elections 2017, Assembly Elections 2017, Rahul Gandhi, PM Modi, Amit shah, Rupani, politics

Gujarat Assembly polls are headed for a photo finish as per the third and the final round of tracker poll conducted by Lokniti-CSDS-ABP News, which claims that both Congress and BJP will get 43% of the votes.

గుజరాత్ కాంగ్రెస్ లో జోష్ నింపిన తాజా ఎన్నికల సర్వే

Posted: 12/05/2017 12:18 PM IST
Congress likely to give neck and neck fight to bjp in gujarat survey

కమలదళానికి కంచుకోటగా వున్న గుజరాత్ లో తాము మళ్లీ అధికారంలోకి వస్తామని పైపైన ధీమాను వ్యక్తం చేస్తున్న బీజేపీకి లోలోన మాత్రం రాహుల్ భయం పట్టిపీడిస్తుంది. అటు ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, బీజేపి అద్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్రమోడీ ఇలా అందరూ ఎవరికి వారు ఎన్నో విధాలుగా చేస్తున్న ప్రచారాలన్నీ బీజేపికి ఏరకంగానూ కలసివచ్చేలా కనిపించడం లేదు. నోట్ల రద్దు ప్రబావంతో పాటు.. జీఎస్టీ ఎఫెక్ట్ కూడా ఈ ఎన్నికలపై స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో కంటే అధికంగా మెజారిటీ సాధించాలని పార్టీ నేతలు అదేశాలు జారీ చేస్తున్నా.. వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా వున్నాయి.

ఈ సారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో 150 స్థానాలను కైవసం చేసుకుంటామని కాషాయ పార్టీ నేతలు బీరాలు పోయినా.. వాస్తవవిక పరిస్థితులు మాత్రం అందుకు అనుకూలంగా లేవని తాజాగా ఫలితాలను వెల్లడిస్తున్న సర్వేలు చెబుతున్నాయి. నిన్నమొన్నటి వరకు బీజేపికి అనుకూతంగా వున్న వాతావరణం కాస్తా ఎన్నికలకు ముందుగానే మారిపోయింది. గుజరాత్ లో బీజేపి-కాంగ్రెస్‌ హోరాహోరీగా తలపడుతున్నాయని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. పలు సర్వేలు బీజేపీకి విజయం కట్టబెడుతున్నా బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంటుందని తాజా సర్వే వెల్లడించింది.

తొలివిడత ఎన్నికలకు ముందు ఈ ఫలితాలు వస్తే.. ఇక రెండో విడత ఎన్నికలకు ముందు ప్రజల తీర్పు ఎలా వుండబోతుంది.. దాదాపు రెండు దశాబ్దాలుగా ఏకచక్రాధిపత్యాన్ని వహించని కాషాయపార్టీకి ఈసారి భంగపాటు తప్పదన్న సంకేతాలు కూడా వెలువుడతున్నాయి. గుజరాత్ లో తాజా సర్వే ప్రకారం..  ఇరు పార్టీలకు 43 శాతం ఓట్లు పోలవుతాయని లోక్ నీతి-సీడీఎస్ పొల్ పేర్కొంది. అయితే 182 మంది సభ్యులు కల గుజరాత్‌ అసెంబ్లీలో బీజేపీకి 91 నుంచి 99 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది.

కాంగ్రెస్‌కు 78 నుంచి 86 స్ధానాలు దక్కవచ్చని పేర్కొంది.  ఆగస్టులో ఇదే పోల్‌ ఏజెన్సీ చేసిన సర్వేలో బీజేపీ సులభంగా 150 మార్క్‌ను దాటుతుంటని, కాంగ్రెస్‌కు కేవలం 30 సీట్లు దక్కుతాయని తేల్చింది. హార్థిక్‌ పటేల్‌, ఇతర యువ నేతల మద్దతుతో కాంగ్రెస్‌ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. మరోవైపు జీఎస్‌టీపై వ్యాపార వర్గాల్లో నెలకొన్న వ్యతిరేకత కూడా బీజేపీకి ప్రతికూలంగా మారింది. ఏబీపీ న్యూస్‌ కోసం లోక్‌నీతి-సీడీఎస్‌ నిర్వహించిన ఈ పోల్‌ కాంగ్రెస్‌లో సరికొత్త ఉత్సాహం నింపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gujarat elections  BJP  Congress  Gujarat Assembly elections  assembly elections  election 2017  

Other Articles