లాభాలను అధిమి పట్టుకోవడంతో పాటు.. సీటు అక్యూపెన్సీని పెంచుకునేందుకు ప్రైవేట్ విమానయాన సంస్థలతో పాటు ప్రభుత్వ రంగ విమానయాన సంస్థలు వివిధ రకాల ఆఫర్లతో ప్రయాణికులను అకర్షించేందుకు ప్రయత్నిస్తూనే వున్నాయి. ఇప్పటికే ఇండిగో, ఎయిరిండియా వంటి సంస్థలు తగ్గింపు ధరలకే టికెట్లను అందిస్తుండగా.. విమానయాన రంగంలోకూడా పూర్తిగా క్యాష్ బ్యాక్ అఫర్ ను ప్రకటిస్తూ స్పెస్ జెట్ విమానయాన సంస్థ తమ కస్టమర్లను అకర్షించింది.
ఫ్రీగానే విమాన ప్రయాణం చేసే సౌలభ్యాన్ని తమ కస్టమర్లకు అందిస్తోంది. విమాన ప్రయాణానికి చెల్లించిన మొత్తాన్ని తిరిగి వోచర్ రూపంలో చెల్లిస్తోంది. దానిని అదే సంస్థకు చెందిన మరో వైబ్ సైట్ లో కొనుగోళ్లు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ నెల 1న ఈ ఆఫర్ ప్రారంభం కాగా... ఈ నెలాఖరు వరకు కస్లమర్లు టికెట్లను బుక్ చేసుకునే అవకాశముంది. ఈ ఆఫర్ కింద టికెట్లు బుక్ చేసుకున్న వారు 2017 డిసెంబర్ 1 నుంచి 2018 మార్చి 31 మధ్య ప్రయాణం చేసే వీలు కల్పించింది.
అయితే అందుకు కొన్ని షరతులును విధించింది. ఆఫర్ ఇలా.. ప్రయాణికులు తొలుత www.spicejet.com వెబ్ సైట్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని ఛార్జీలతో కలిపి టికెట్ మొత్తాన్ని సదరు పోర్టల్ ద్వారా చెల్లించాలి. ఆ లావాదేవీ పూర్తయిన తర్వాత స్పైస్ జెట్ కే చెందిన www.spicestyle.com షాపింగ్ వెబ్ సైట్లో లాగిన్ అవ్వాలి. అందులో స్టైల్ క్యాష్ లోని మై అకౌంట్ సెక్షన్ లో ఎస్సెమ్మెస్ ద్వారా వచ్చిన కోడ్ ను ఎంటర్ చేయడం ద్వారా టికెట్ కు చెల్లించిన మొత్తం స్టైల్ క్యాష్ లో జమ అవుతుంది.
స్టైల్ క్యాష్ లో మొత్తాన్ని www.spicestyle.com వెబ్ సైట్ లో కొనుగోళ్లకు ఉపయోగించుకోవచ్చు. ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా 30 శాతం మొత్తాన్ని వినియోగించుకోవచ్చు. స్టైల్ క్యాష్ మొత్తాన్ని 2018 మార్చి 31లోపు వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఒక పీఎన్ఆర్ నంబర్ కు ఒక వోచర్ ను మాత్రమే ఇస్తారని స్పైస్ జెట్ తన పోర్టల్ లో పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more