Mysterious posters project Ahmed Patel as Gujarat CM ఓటమి భయంతోనే బీజేపి డర్టీ ట్రిక్స్..

Posters seeking support for ahmed patel as cm stir controversy

Surat, Muslims, Congress, Ahmed Patel, BJP, Congress chief minister candidate, Rahul Gandhi, Gujarat assembly polls, Gujarat elections 2017, Gujarat, politics

Posters appealing Muslims to vote for Congress to make Ahmed Patel the chief minister came up in some minority-dominated areas, but Patel called it a "dirty trick" by the BJP and said he was not in the race.

సీఎం అభ్యర్థిగా పోస్టర్లు.. బీజేపీ డర్టీ పాలి‘ట్రిక్స్’.. రుసరుసలు

Posted: 12/07/2017 06:13 PM IST
Posters seeking support for ahmed patel as cm stir controversy

ఎన్నికలకు ముందు ప్రజలకు పలు హామీలు గుప్పించే పార్టీలు.. అనేక నీతి సూక్తులు కూడా చెబుతుంటాయి. నీతి, న్యాయం, ధర్మం అనుసారంగానే తమ పార్టీ నడుస్తుందని ఎవరికి వారు ప్రసంగాలు దంచికొడతారు. అయితే ఎన్నికలు సమీపించిన కొద్దీ ఈ లెక్కలు అన్ని మారుతాయి. తాము పార్టీ గెలుస్తుందన్న నమ్మకం వున్నా.. అధికారంలోకి వస్తామన్న నమ్మకం వున్నా.. మౌనంగా వుంటే పార్టీలు.. తమ పార్టీకి ఈ సారి ఎన్నికలలో పరాభవం తప్పదని తెలిస్తే మాత్రం.. డర్టీ పాలి‘ట్రిక్స్’కు పాల్పడకమానవు. అప్పటి వరకు చెప్పిన నీతి, న్యాయం, ధర్మం అన్నింటినీ గంగలో కలిసేసి మరీ కుయుక్తులకు, కుతంత్రాలకు తెరతీస్తుంటాయి.

అచ్చంగా గుజరాత్ లో కూడా ఇలానే జరిగింది. ఎన్నికలకు నెల రోజుల మందు తాము తప్పక అధికారంలోకి వస్తామని చెప్పిన పాలక పక్షం..  తీరా ఎన్నికలకు ఒక్క రోజు ముందు మాత్రం బొర్లా పడిందన్న వార్తలను పలు మీడియా సంస్థలు ప్రసారం చేశాయి. అయితే ఈ నేపథ్యంలో తమకు చేతిలో వున్న ఒక్క రోజులో మార్పును తీసుకువచ్చేందుకు పాలక పక్షం డర్టీ పాలిట్రిక్స్ కు తెరతీసందిన కాంగ్రెస్ అరోపిస్తుంది. మతాల వారీగా మనుషులను విడదీసి గుజరాత్ ఎన్నికలలో లబ్ది పోందాలని కుతంత్రానికి పాల్పడిందని కూడా విమర్శలు చేస్తుంది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే..?

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా అహ్మద్‌ పటేల్ ను ప్రకటిస్తుందన్న పోస్టర్లు ఆ రాష్ట్రంలో దర్శనమిచ్చాయి. ఇందులో భాగంగా పోస్టర్స మీద అహ్మద్ పటేల్ సీఎం కావడం కోసం కాంగ్రెస్ కు ఓటేయాలని ముస్లింలకు పిలుపు ఇస్తూ సూరత్ తో పాటు పలు నగరాల్లోని ముఖ్యప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. అహ్మద్ పటేల్ సీఎం అభ్యర్థి అంటూ వెలిసిన పోస్టర్లు కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అయితే ఈ విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత.. సోనియాగాంధీ రాజకీయ సలహాదారుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ స్పందించారు. తాను కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని కాదని, భవిష్యత్తులోనూ సీఎం రేసులో ఉండబోనని వెల్లడించారు.

బీజేపి ఓటమి భయంతోటే ఇలాంటి ప్రచారానికి దిగిందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ అధినేతగా ఎన్నిక కానున్న రాహుల్ గాంధీ గుజరాత్ ప్రచార బరిలో సర్వం తానై ముందుండి నడిపిస్తున్నారు. గుజరాత్ సీఎం అభ్యర్థిగా ఆ పార్టీ ఏ ఒక్కరి పేరునూ ఇంతవరకూ ప్రతిపాదించని విషయం తెలిసిందే. అయితే తాజా సర్వేల ద్వారా గుజరాత్ లో కాంగ్రెస్ బలం పుంజుకుందని తెలియడంతో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు. కాగా గుజరాత్‌లో 1998 నుంచి బీజేపీ అధికారంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles