గుజరాత్ శాసనసభ తొలి దశ ఎన్నికల పోలింగ్ జోరందుకుంది. ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ స్టేషన్ల వద్దకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకన్నారు. గుజరాత్ అభివృద్దిలోనే కాదు పోలింగ్ కూడా రికార్డును నమోదు చేయాలన్న ప్రధాని నరేంద్రమోడీ వినతిని ప్రజలు స్వీకరించారు. తొలి రెండు గంటల వ్యవధితోనే దాదాపుగా 15 శాతం పోలింగ్ నమోదు కావడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది.
సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లోని 89 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. గుజరాత్ సీఎం విజయ్ రుపాని, కాంగ్రెస్ నేత శక్తి సిన్హ్ గోహిల్ సహా మొత్తం 977 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. మొత్తం 2.12 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ తొలిదశ ఎన్నికలలో మొత్తంగా 397 మది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో ఈవీఎం మెషీన్లతో పాటు వివిపాట్ పోలింగ్ యంత్రాలను కూడా ప్రవేశపెట్టారు. అయితే పోలింగ్ సమయం ప్రారంభంలో అనేక చోట్ల ఈవీఎం యంత్రాలు మొరాయించాయి. కొన్న ఈవీయం యంత్రాలను అధికారులు మరమ్మతులు చేయగా, మరికొన్నింటిని మాత్రం రీప్లేస్ చేశారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 14న మిగిలిన స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. 18న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
కాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై కాంగ్రెస్ పార్టీ గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ రాష్ట్రంలో తాము ఖచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. గుజరాత్ నుంచి బీజేపీని తుడిచిపెడతామని అంటోంది. 'గుజరాత్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వస్తుందని మేం విశ్వాసంతో ఉన్నాం. 22 ఏళ్ల తర్వాత గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతోంది. రాష్ట్రం నుంచి బీజేపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. గుజరాత్ లో ప్రతి ఒక్కరూ మార్పు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆ మార్పును అందిస్తుంది' అని పార్టీ సీనియర్ నేత రాజు వాఘ్మారే పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more