మీరు ఏప్రిల్ ఫూల్ అయ్యారా..? మరీ డిసెంబర్ ఫూల్.. అదేంటి అలా అడుగుతున్నారు.. ఎక్కడైనా డిసెంబర్ ఫూల్ వుందా...? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయా..? ఏప్రిల్ ఫూల్ వున్నప్పుడు.. డిసెంబర్ ఫూల్ ఎందుకు వుండదు..? అని వాదించేవాళ్లూ కూడా లేకపోలేదు. అయితే ఇప్పుడు ఏప్రిల్ ఫూల్ ఎందుకు చేస్తారన్న మ్యాటర్ లోకి ఎంటర్ కాకుండానే విషయంలోకి వస్తున్నాం.. సోషల్ మీడియాలో వచ్చే కొన్ని ఫార్వర్డ్ మెసేజ్ లు కొన్ని జనాలను అలోచనలో పడేలా చేస్తాయి.
అయితే అలాంటి వాటిని సరిచూసుకోకుండా అలాగే ఫార్వడ్ చేస్తే.. అబాసుపాలు కాకతప్పదు. మరీ ఇలాంటి మెసేజ్ లను ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు ఫార్వర్డ్ చేస్తే పరువుకు నష్టం. అంతేకాదు ఇంత పెద్ద సెలబ్రిటీగా వున్నారు.. మీకు ఈ మాత్రం తెలియదా అని కూడా నెట్ జనులు పరువు తీసేస్తుంటారు. అలా ఓ ఫార్వర్డ్ మెసేజ్‌ను ట్వీట్ చేసి కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో ఫూల్ అయ్యారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే... ఫూల్ అయినట్లు ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు కూడా!
‘వచ్చే ఏడాది జనవరి 1, ఫిబ్రవరి 2, మార్చి 3, ఏప్రిల్ 4, మే 5.. ఇలా డిసెంబర్ 12 వరకు అన్ని తేదీలు ఆదివారం అవుతున్నాయి’ అని ఉన్న ఓ మెసేజ్‌ను బాబుల్ ట్వీట్ చేశారు. అయితే జనవరి 1 ఈసారి సోమవారం అవుతుంది. ఈ విషయాన్ని నెటిజన్లు వెంటనే ట్వీట్ కింద కామెంట్లు చేశారు. ఇలాంటి నకిలీ వార్తలు షేర్ చేసేముందు ఒకసారి చెక్ చేసుకోవాలని, వెంటనే ట్వీట్ డిలీట్ చేయాలని చెప్పారు. అయితే దానికి మంత్రి స్పందించిన తీరు చాలా ఆకట్టుకుంటోంది.
ఎవరో ఇలాంటి నకిలీ మెసేజ్ ను సృష్టించారు. చాలా కోపం వచ్చింది. కానీ, మీరు చెప్పినట్లు నేను ఈ ట్వీట్‌ను తొలగించను. ఎందుకంటే మనమందరం తప్పులు చేస్తుంటాం. లేదంటే డిసెంబరులో ఏప్రిల్ ఫూల్ అవుతుంటాం. ఈ మెసేజ్ వల్ల నేను ఫూల్ అయ్యానని ఒప్పుకొంటున్నాను’ అని బాబుల్ సుప్రియో ట్వీట్ చేశారు. దీనిపై కూడా నెట్ జనులు ట్విట్ల వర్షం కురిపిస్తున్నారు. మంత్రిగారు తమ వాదనను సమర్థించుకునేందు ఇలాంటి అవకాశాన్ని ఎప్పట్నించో వెతుకుతున్నట్లు వుందని, కొందరు.. అర్రే మంత్రిగారు డిసెంబర్ ఫూల్ చేస్తానంటే.. ఛాన్సు ఇవ్వరేం అని మరికొందరు ట్రాల్ చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more