ఆంధ్రప్రదేశ్ నవ్య రాజధాని అమరావతి ఆకృతులు ఇక తుది దశకు చేరుకోనున్నాయి. అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో క్రితం రోజున భేటీ అయిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఇప్పటికే తుది మార్పులు చేర్పులను వివరించారని సమాచారం. అమరావతి రాజధాని నిర్మాణంలో రాజమౌళి సాయాన్ని అంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజమౌళి రేపు అమరావతికి కూడా వెళ్లనున్నారని సమాచారం. అమరావతిలో ఏపీ మంత్రి నారాయణ, నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు, సీఆర్డీఏ అధికారులతో భేటీ కానున్నారు.
అనంతరం చంద్రబాబుతో కూడా రాజమౌళి సమావేశం కానున్నారని సమాచారం. రాజధాని ఆకృతులను చంద్రబాబు సర్కారు ఎల్లుండి ఖరారు చేసి, ప్రజాభిప్రాయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే రాజమౌళి పలుసార్లు రాజధాని ఆకృతులపై చర్చించారు. దీంతో ఇక అకృతులను ఫైనల్ చేయనున్న తరుణంలో రాజమౌళి బృందం ఫైనల్ గా అమరావతిలో పర్యటించి.. నార్మన్ సోస్టర్ ప్రతినిధులతో భేటీకానున్నారు. రాజధాని నిర్మాణంలో అకృతులను ఫైనల్ చేస్తున్న క్రమంలో రాజమౌళికి ఇస్తున్న ప్రాధాన్యతపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం విమర్శలను ఎధర్కొవాల్సి వస్తుంది.
ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పలుమార్లు భేటీ అయిన రాజమౌళి బృందంలో రాజమౌళితో పాటు ఆయన కుమారుడు కార్తీకేయ కూడా పాల్గొనడం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్లు తన తండ్రి తీసే సినిమా ప్రమోషన్ పనుల్లో పాలుపంచుకున్న కార్తీకేయ.. ఇక రాజధాని విషయంలో కూడా తండ్రికి సాయం చేశారా..? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
ఇక కొడుకు సాయం తీసుకోవడంలో రాజమౌళి తప్పు లేదు కానీ.. ఆయనను వెంటబెట్టుకుని చంద్రబాబు సహా మంత్రులు, ఉన్నతస్థాయి అధికారుల వద్దకు తీసుకెళ్లడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాజమౌళి విషయంలోనే గగ్గోలు పెడుతున్న పార్టీలకు ఇది మరో అవకాశాన్ని అందించనట్లేనేమో. అయితే దీనిపై దర్శకధీరుడు ఏం సమాధానం ఇస్తాడో వేచిచూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more