టాలీవుడ్ కమెడియన్ విజయ్ సాయి.. ఆత్మహత్య వెనుక కుటంబ కలహాలే కారణమని ఆయన వీడియో రికార్డింగ్ స్పష్టం చేస్తుంది. తన భార్య అంతకుముందు రోజు రాత్రి నలుగురు రౌడీలతో వచ్చి తన కారును తీసుకెళ్లిందని.. అమెతో పాటు శశిధర్, అమె తరపు న్యాయవాది శ్రీనివాస్ ముగ్గురి వేధింపుల కారణంగానే తాను అత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఆయన సెల్పీ వీడియో చెప్పినా.. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు విజయ్ సాయి భార్య వనిత అసలు పేరు అది కాదని, దీంతో పాటు విస్తుపోయే అనేక విషయాలు కూడా వెలుగుచూశాయి.
విజయ్ సాయి భార్య అసలు పేరు వరలక్ష్మీ. అయితే అమె వనితగా తన పేరు మార్చుకుంది. ఇలా ఎందుకు పేరు మార్చుకోవాల్సి వచ్చిందన్న విషయాన్ని కూడా పోలీసులు దర్యాప్తులో భాగంగా విచారిస్తున్నారు. ఇక కేసు దర్యాప్తులో భాగంగా అమె పర్టిఫికెట్లను పరిశీలించిన పోలీసులకు స్కూల్ సర్టిఫికేట్ లో ఒక పేరు.. పాస్ పోర్టులో మాత్రం వేరే పేరు వుందని కూడా గుర్తించారు. ఇక స్కూల్ సర్టిఫికెట్లలో తండ్రి పేరు ఒకరిదిగా వుండగా, పాస్ పోర్టులో మాత్రం తండ్రి పేరు కూడా మారింది. దీంతో విజయ్ సాయి మరణం వెనుక అమె భార్య వనిత వుందన్న అనుమానాలు కూడా పోలీసుల్లో బలపడుతున్నాయి.
అయితే వనిత విషయంలో నిజాలను తెలుసుకుంటున్న పోలీసులకు అమె తల్లి విషయంలో చోటుచేసుకున్న పరిణామాలు కూడా విస్తుగోలుపుతున్నాయి. వనిత తల్లి రఫీ అనే వ్యక్తితో సహజీవనం చేసిందని కూడా కనుగొన్నారు. దీంతో రఫీకి విజయ్ సాయి ఆత్మహత్యతో ఏమైనా సంబంధముందా... అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ అనే న్యాయవాదికి, వనితకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారని తెలుస్తోంది. వీరికి నోటీసులు ఇచ్చిన అనంతరం అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more