దేశపౌరులలో నెలకొన్న అందోళనను ఎట్టకేలకు అర్థం చేసుకున్న సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెసలుబాటు కల్పించింది. కేంద్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలతోపాటు, ఇతర సేవలకోసం ఆధార్ లింకింగ్ ను తప్పనిసరి చేసిన క్రమంలో సుప్రీంకోర్టు దేశపౌరులకు భారీ ఊరట నిచ్చింది. ఆధార్ అనుసంధాన ప్రక్రియలకు విధించిన గడువును మార్చి 31, 2018 వరకు పొడగిస్తూ ఇవాళ మధ్యాహ్నం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదే సమయంలో అధార్ కార్డులో పోందుపర్చిన దేశ పౌరుల వ్యక్తిగత వివరాలను కేంద్ర ప్రభుత్వం సుమారుగా అన్ని సేవలకు తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయంపై జనవరి మాసం నుంచి వాదనలు ప్రారంభమవుతాయని కూడా పేర్కొనింది. దీంతో ఆధార్ చట్టం చట్టబద్ధత అంశంపై తదుపరి వాదనలను జనవరి 17వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ప్రధాన న్యాయమూర్తి దీపాక్ మిశ్రా నేతృత్వంలోని అయిదుగురు జడ్జిల ధర్మాసనం ఈ విషయంపై మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది
దీంతో అన్ని ప్రభుత్వ పథకాలు, బ్యాంకు అకౌంట్లు, మొబైల్ ఫోన్ల తో పాటు ఇన్సూరెన్స్, డీమ్యాట్, ప్రభుత్వ పథకాలకు ఆధార్ లింకింగ్ గడువును పొడగించించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారులకు ఉపశమనం కల్పించింది. అలాగే కొత్త బ్యాంకు ఖాతాలను తెరవడానికి కూడా ప్రస్తుతానికి ఆధార్ అనుసంధానం అవసరం లేదని తేల్చి చెప్పింది. ఆధార్ నంబర్ లేకుండానే బ్యాంకు ఖాతాను తెరవచ్చని స్పష్టం చేసింది.
అయితే ఆధార్ కార్డుకోసం దరఖాస్తు చేసిన కాపీని జతచేయాలని తెలిపింది. దీంతోపాటు 2018, ఫిబ్రవరి 6వ తేదీతో ముగియనున్న మొబైల్ ఆధార్లింకింగ్ గడువును కూడా మార్చి 31 వరకు పొడిగించింది. ఇప్పటికే ఈ అంశంపై నమోదేన పిటీషన్ పై వ్యక్తిగత వివరాలు పౌరుల హక్కు అంటూ దేశ అత్యున్నత న్యాయస్థానికి చెందిన తొమ్మిది మంది న్యాయమూర్తులు బెంచ్ తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more