గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ విజయ దుందుభి మోగించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 92 స్థానాల్ని భారతీయ జనతా పార్టీ ఇప్పటికే సాధించిన విషయం తెలిసిందే. గుజరాత్లో బీజేపీ మొత్తం 99 స్థానాలు గెలుపొందింది. కాంగ్రెస్ కూటమి 80 స్థానాలను గెలుపొందింది. ఇక ఇతరులు 3 స్థానాల్లో విజయం పొందారు.
కాగా, హిమాచల్ ప్రదేశ్‌లోనూ బీజేపీ మ్యాజిక్ ఫిగర్ (35) ను దాటేసి దూసుకెళుతోంది. ఇప్పటివరకు 41 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ మరో 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 19 స్థానాల్లో గెలుపొంది 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక ఇతరులు 3 స్థానాల్లో గెలుపొందారు. దేశ వ్యాప్తంగా బీజేపీ నేతల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.
హర్దిక్ అవే ఆరోపణలు...
చాలాచోట్ల బీజేపీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు.. రిజర్వేషన్ల కోసం మా పోరాటం కొనసాగుతుంది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా బీజేపీపై పోరాడుతాం అని పటీదార్ ఉద్యమ నేత హర్దిక్ పటేల్ తెలిపారు.
ఖండించిన కేంద్ర మంత్రి...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఇప్పటికే అత్యధిక స్థానాల్లో గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన బలాన్ని సంపాదించిన భారతీయ జనతా పార్టీ హిమాచల్ ప్రదేశ్‌లోనూ దూసుకెళుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ తమ ఓటమిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ మాట్లాడుతూ... ఎన్నికల్లో ఓడిపోతే ఈవీఎంలు సరిగా లేవనడం సరికాదని అన్నారు. అటువంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని నితిన్ గడ్కరీ ప్రశ్నించారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో అన్ని వర్గాల ప్రజలు బీజేపీకి మద్దతు పలికారని చెప్పారు. అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారని చెప్పారు. ఎన్నికల్లో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలని హితవు పలికారు.
ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా...
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వరుస ట్వీట్లు చేశారు. ‘బీజేపీ పై గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ప్రజలు చూపిన ప్రేమ, విశ్వాసానికి ధన్యవాదాలు. నా శిరస్సు వంచి వారికి నమస్కరిస్తున్నా. ఆయా రాష్ట్రాలను అభివృద్ధి పథంలో నడిపించే విషయంలో వేలెత్తి చూపడానికి వీలులేకుండా ఉంటామని హామీ ఇస్తున్నాను. ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధికి నిరంతరం పాటుపడతాం. సుపరిపాలన, అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారు. కష్టపడి పని చేసిన బీజేపీ కార్యకర్తలకు ధన్యవాదాలు’ అని మోదీ పేర్కొన్నారు.
I bow to the people of Gujarat and Himachal Pradesh for their affection and trust in BJP. I assure them that we will leave no stone unturned in furthering the development journey of these states and serve the people tirelessly.
— Narendra Modi (@narendramodi) December 18, 2017
Election results in Gujarat and Himachal Pradesh indicate a strong support for politics of good governance and development. I salute the hardworking BJP Karyakartas in these states for their hardwork which has led to these impressive victories.
— Narendra Modi (@narendramodi) December 18, 2017
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more