mayor swaroopa senstaional comments on MP JC జేసీ దివాకర్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు..

Ananthapur mayor swaroopa calls mp jc diwakar reddy an evil

ananthapur mayor, swaroopa, MP JC Diwakar reddy, TDP, Chandrababu, Development, Roads, ananthapur, andhra pradesh, politics, latest news

Ananthapur mayor swaroopa sensational comments on MP JC diwakar reddy, calls him an evil person who always enters at a certain time and does the evil to the people.

ఎంపీ జేసీ ఒక రాక్షసుడు.. ఇదే రాసుకోండి: మేయర్ స్వరూప

Posted: 12/20/2017 04:06 PM IST
Ananthapur mayor swaroopa calls mp jc diwakar reddy an evil

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై సొంతపార్టీకి చెందిన అనంతపురం మేయర్ స్వరూప సంచలన వ్యాఖ్యలు చేశారు. జేసీ దివాకర్ రెడ్డి రాక్షసుడని పేర్కొన్న అమె ఇదే విధంగా మీరు రాసుకోండని, ఇదే రేపు పేపర్లో కూడా రావాలని అమె కోరారు. అందుకనే తాను ప్రత్యేకంగా చెబుతున్నానని, ఏదైనా మంచి కార్యక్రమం జరుగుతున్న సమయంలో రాక్షసుడు వచ్చి అంతా చెబగొట్టడం మనం పాత చిత్రాలలో చూశామని, అదే విధంగా జేసి దివాకర్ రెడ్డి కూడా రాక్షసుడని అమె వ్యాఖ్యానించారు.

చుట్టుపు చూపుగా 3 నెలలకు ఒకసారి నగరానికి వచ్చి తాము చేసిన అభివృద్ధి పనులను చూడకుండా సొంత పార్టీ మేయర్ అధికారంలో వుండి విమర్శలకు దూరంగా అభివృద్ది బాటలో అనంతపురాన్ని తీసుకెళ్లున్న క్రమంలో అయన విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన నల్ల అద్దాలు తీసి, తెల్లద్దాలు పెట్టుకోవాలని మేయర్ సూచించారు. ‘‘జేసీ దివాకర్ రెడ్డి ఎంపీ అయితే బాగుంటుందని మేము ప్రజల కాళ్లు పట్టుకుని ఓట్లు వేయించి గెలిపించామని కానీ అర్థరూపాయి కూడా ఆయన అనంతపురం నగర అభివృద్దికి వెచ్చించలేదని విమర్శించారు.

తనకు వచ్చిన నిధులు కూడా ఖర్చు పెట్టలేదు. రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటా అని చెబుతున్నారు. ఇలాంటి సమయంలోనైనా మంచి పనులు చేసి విశ్రాంతి తీసుకుంటే బాగుటుంది.’’ అని మేయర్ స్వరూప అన్నారు. తాము నగరాభివృద్ధికి ఇప్పటికే రూ.100 కోట్లను వెచ్చించామని, వాటిని చూసి మాట్లాడాలని ఆమె అన్నారు. ఆయన సూట్ వేసుకోవడమేకాదు... సూటయ్యే పనులు చేయాలని ఆమె ఘాటుగా విమర్శించారు. నగరాభివృద్ధికి అర్ధరూపాయి ఖర్చుపెట్టని ఎంపీ దివాకర్‌రెడ్డి విమర్శలు చేయడం తగదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles