వివాహాలకు వచ్చే అతిథులపై పూలు, పన్నీరు చల్లడం సాధారణమే. అయితే కాసింత సంపన్నుల ఇళ్లలో రిటన్ గిఫ్ట్స్ ఇవ్వడం కూడా తెలిసిందే. ఇక తమ పరపతి చాటుకునే ప్రయత్నంలో పెళ్లి వేడుకల్లో కళాకారులపై డబ్బులు వెదజల్లడమూ కామనే. కానీ పెండ్లికి వచ్చిన అతిథులతో పాటు వేడుక జరిగిన ఊరు ఊరందరిపైనా డబ్బులు, మొబైల్ఫోన్లు వర్షంలా కురిపించడం గురించి తెలుసా..? అదే పాకిస్థాన్ లో జరిగింది.
తన మన పర బేధం లేకుండా అక్కడికొచ్చిన ప్రతి ఒక్కరికీ మొబైల్ ఫోనో, దేశీయ, విదేశీ కరెన్సీల వర్షం కురిసిందక్కడ. డాలర్ లేదా రియాల్ కరెన్సీ నోటో అతిధులకు సొంతమైంది. దొరికిన వాడికి దొరికినంత అన్నట్లుగా అక్కడి అతిధులు, వేడుకకు హాజరైన వారు తమ జేబుల్లో జొప్పించేసుకున్నారు. పాకిస్తాన్లో జరిగిన ఓ పెండ్లి వేడుకలో చోటుచేసుకున్న ఈ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే.. ముల్తాన్ లోని షుజాబాద్ కు చెందిన మొహమ్మద్ అర్షద్ కు.. పంజాబ్ ఫ్రావిన్స్ లోని ఖన్పూర్ కు చెందిన వధువుతో వివాహమైంది. వరుడు వధువువారింటికి వివాహవేదిక వద్దకు చేరుకోగానే.. అర్షద్ బంధువులు ఇలా నోట్లు, మొబైల్ ఫోన్ల వర్షం కురిపించారు. యావత్ పాకిస్థాన్ సహా నెట్టింట్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ వివాహం చర్చనీయాంశంగా మారింది. కనీవినీ ఎరుగని రీతిలో చేతికి ఏ నోటు వస్తుందన్న విషయాన్ని కూడా మర్చిపోయిన వరుడి బంధువులు కాసుల వర్షం కురిపించారు.
అందుకు కారణం.. అర్హద్ కు మొత్తం ఎనిమిది మంది సోదరలు వుండగా, వారిలో నలుగురు అమెరికాలోనూ, ఇంకొందరు సౌదీ అరేబియాలోనూ స్థిరపడి బాగా సంపాదించారు. ఆఖరు తమ్ముడి పెళ్లి అందరికీ గుర్తుండాలనే ఉద్దేశంతో ఇలా కాసులు, కాస్టీ మొబైల్ ఫోన్ల వర్షం కురిపించారు. అయితే అదే ఇప్పడు వారికి కష్టాలను కూడా తెచ్చిపెట్టింది. వారు విసిరిన కాసులు వర్షం నేపథ్యంలో పాకిస్థాన్ లోని ఫెడరల్ బోర్డు అఫ్ రెవెన్యూ దినిపై దృష్టి సారించింది. ఈ డబ్బులన్నీ లెక్కలు వున్నావేనా..? లేక అక్రమంగా సంపాదించినవా..? అన్న కోణంలో దర్యాప్తు చేస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more