నగరంలో మరో ప్రేమోన్మాది ఘాతుకంతో యువతి ప్రాణాలు కోల్పోయింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంధ్యారాణి ఈ ఉదయం కన్నుమూసింది.
హైదరాబాద్ లోని లాలాపేట ప్రాంతంకు చెందిన సంధ్యారాణిని ప్రేమిస్తూ వచ్చిన రాజేష్, ఆమె తనను తిరస్కరించిందన్న కారణంతో, నడిరోడ్డుపై ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించిన సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం 6.40 గంటల ప్రాంతంలో లాలాపేట అంబేద్కర్ విగ్రహం వద్ద రాజేష్ ఈ ఘాతుకానికి పాల్పడగా, 70 శాతం కాలిన గాయాలతో బాధితురాలు, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.
కుటుంబ బాధ్యతలు మొత్తం తానే...
స్థానిక భజన సమాజం ప్రాంతంలో నివసించే నిరేటి సంధ్యారాణి(23) తండ్రి దాసు చిన్నతనంలోనే చనిపోయారు. ముగ్గురు సోదరులకు వివాహాలై వేరే ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఇద్దరు అక్కలకు పెళ్లిళ్లు అయినప్పటికీ కొన్నికారణాలతో వారు ఇంట్లోనే ఉంటున్నారు. తల్లి సావిత్రితో పాటు అక్కల బాధ్యత సంధ్యారాణి తీసుకుంది.
డిగ్రీ పూర్తి చేసిన ఆమె శాంతినగర్ చౌరస్తాలోని లక్కీ ట్రేడర్స్ అనే అల్యూమినియం డోర్స్, విండోస్ తయారు చేసే సంస్థలో అకౌంటెంట్‌గా పని చేస్తోంది. తన జీతంతో కుటుంబాన్ని పోషిస్తూ పెద్దదిక్కు అయ్యింది. కాగా, లాలాపేట్‌లోని ఈదమ్మగుడి ప్రాంతంలో సంధ్యారాణి స్నేహితురాలు నివసిస్తోంది. అప్పుడప్పుడు అక్కడికి వెళ్లే సంధ్యారాణికి స్నేహితురాలి సోదరుడు కార్తీక్(25)తో పరిచయమైంది. అప్పటి నుంచి తనను ప్రేమించాలంటూ అతను వేధించటం ప్రారంభించాడు.
ఘాతుకానికి పాల్పడిన తీరు...
సంధ్యారాణి రోజూ విధులు ముగించుకున్న తర్వాత లాలాపేట్ విద్యామందిర్ మీదుగా ఇంటికి నడిచి వెళ్తుంటుంది. గురువారం సాయంత్రం కార్తీక్ కిరోసిన్ డబ్బాతో ఆ ప్రాంతానికి చేరుకుని కాపు కాశాడు. సంధ్యారాణి 6 గంటల ప్రాంతంలో అటుగా రావడం గమనించి.. మరోసారి వేధింపులకు దిగాడు. అతడి ప్రతిపాదనను ఆమె తిరస్కరించడంతో విచక్షణ కోల్పోయి.. వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను ఆమెపై పోశాడు. షాక్‌కు గురైన సంధ్యారాణి వెంటనే తేరుకుని పారిపోవడానికి ప్రయత్నించింది. ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో జనం ఉండే ప్రాంతానికి పరిగెత్తింది. ఈ లోపే ఆమె వెంట పరిగెత్తిన కార్తీక్ నిప్పుపెట్టాడు.
శరీరం కాలుతున్న బాధతో ఆమె హాహాకారాలు చేస్తుంటే అక్కడ నుంచి పారిపోయాడు. కాలుతున్న శరీరంతోనే దాదాపు 200 మీటర్లు పరిగెత్తిన సంధ్యారాణి అక్కడ కుప్పకూలిపోయింది. ఇది గమనించిన స్థానికులు ఆమె వద్దకు చేరుకుని నీళ్లుపోసి మంటలార్పి.. పోలీసులు, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అనంతరం పోలీసు స్టేషన్ లో కార్తీక్ లొంగిపోయాడు.అతనిపై పెట్టిన హత్యాయత్నం కేసును, ఇప్పుడు హత్య కేసుగా మార్చనున్నట్టు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more