Vijay Rupani to continue as CM సీఎం పీఠం మళ్లీ విజయానిదే.. పటేల్ కు డిఫ్యూటీ..

Vijay rupani to continue as cm patel to get deputy cm

Gujarat Chief Minister Vijay Rupani, Vijay Rupani, Arun Jaitley, BJP MLAs meeting, BJP Legislature Party leader, Nitin Patel

Vijay Rupani will continue as the Chief Minister of Gujarat and Nitin Patel as his deputy,

సీఎం పీఠం మళ్లీ విజయానిదే.. పటేల్ కు డిఫ్యూటీ..

Posted: 12/23/2017 10:06 AM IST
Vijay rupani to continue as cm patel to get deputy cm

గుజరాత్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిపై కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. ఎటువంటి సంచలనాలకూ తావులేకుండా తాజా మాజీ సీఎం అయిన విజయ్‌ రూపాణీనే మరోసారి సీఎం పదవికి ఖరారు చేస్తూ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ వ్యవహారాల పరిశీలకుడు, కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. గాంధీనగర్ లో జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో నిర్వహించిన ఈ భేటీలో ఎమ్మెల్యేలందరూ రూపాణీకే మద్దతు పలికారని ఆయన తెలిపారు.

ఇక ఉప ముఖ్యమంత్రి పదవిలో నితిన్‌ పటేల్‌ కూడా యధాతధంగా కొనసాగనున్నారు. తాజా ఎన్నికలతో కలిపి గుజరాత్ లో బీజేపీ 1995 నుంచి వరుసగా ఆరుసార్లు గెలిచింది. అయతే తాజాగా 2017లో తాజాగా జరిగిన ఎన్నికలలో తొలిసారి గా కనిష్టంగా 99 స్థానాలను మాత్రమే సాధించగలిగింది. మొత్తం 182 సీట్లకుగాను 99 సీట్లు కైవసం చేసుకొని ఆ పార్టీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. 77 సీట్లతో కాంగ్రెస్‌ మళ్లీ ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది.
 
గత రెండు దశాబ్దాలలో బీజేపీకి ఇక్కడ వందకంటే తక్కువ సీట్లు రావడం ఇదే ప్రథమం. కాగా, స్వతంత్ర ఎమ్మెల్యే ఒకరు కమలానికి మద్దతు ప్రకటించడంతో బీజేపీ బలం వందకు చేరింది. ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే రతన్‌సింగ్‌ రాథోడ్‌ బీజేపీకి బేషరతు మద్దతు ఇస్తూ గవర్నర్‌ ఓంప్రకాశ్‌ కోహ్లీకి లేఖ రాశారు. కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి భంగపడిన రాథోడ్‌ ఇండిపెండెంట్‌గా గెలిచారు. కాగా, 15 స్థానాలలో కేవలం వెయ్యిలోపు ఓట్లతో కాంగ్రెస్ ఓటమిని చవిచూసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles