model gangraped in delhi on christmas సినిమా చాన్స్ పేరుతో మోడల్ పై గ్యాంగ్ రేప్..

Bihar young model alleges gang rape in delhi s rk puram

gang rape, model gangraped, young model gangraped, bihar model gangraped, sexual assault on model, sexual assault on pretext of movie chance, sexual assault in delhi, gangrape in sarogini nagar, delhi police, bihar model gangraped in delhi, delhi crime, Delhi rape, Model, gang-rape, Sarojini Nagar, rapists, model raped, alcohol rape, crime

An aspiring model (23) was allegedly gang-raped by three people on the pretext of providing movie chances in bollywood films and jobs in television in south Delhi's Sarojini Nagar.

సినిమా చాన్స్ పేరుతో మోడల్ పై గ్యాంగ్ రేప్..

Posted: 12/28/2017 10:11 AM IST
Bihar young model alleges gang rape in delhi s rk puram

దేశంలో మహిళల భద్రత ఇంకా ప్రశ్నార్థకంగానే మారుతుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన కామపిశాచాలు అడపడచులకు గౌరవం ఇవ్వాల్సిందిపోయి.. అదును అందిపుచ్చుకుని మరీ అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. ఎక్కడో ఏ మూలనో ఇలాంటి దారుణాలు జరిగినా క్షమించదగింది కాదు. అలాంటిది ఏకంగా దేశ రాజధానిలోనే ఈ దారుణాలకు కేంద్రంగా మారింది. ఢిల్లీ ఇక దేశానికి కాకుండా అఘాయిత్యాలకు కూడా రాజధానిగా మారింది.

ఇక ఇలాంటి కేసుల్లో బాధితురాలితో నిందితులు రాజీ కుదుర్చుకునేందుకు కూడా దేశ సర్వోన్నత న్యాయస్థానం వీలు కల్పించలేదు. అత్యాచారానికి రాజీలు వుండవని, ఆ నేరం ఎవరు చేసినా దానికి శిక్ష అనుభవించాల్సిందేనని కూడా తేల్చిచెప్ిపంది. అయినా నేరగాళ్ల సంఖ్య మాత్రం తగ్గడం లేదు సరికాగా నేరాలకు కూడా పెరుగుతున్నాయి. అడపడచులపై అఘాయిత్యాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఢిల్లీలో మోడల్‌(23) పై జరిగిన గ్యాంగ్ రేప్ కలకలం రేపింది.

పలు టీవీ సీరియళ్లలో సహాయక పాత్రల్లో నటించిన మోడల్ ను మాయమాటలతో వంచించిన పైశాచిక మృగాలు దారుణానికి తెగబడిన ఘటన వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం... బిహార్ కు చెందిన సదరు యువతి మోడలింగ్ కోసం ఢిల్లీకి వచ్చి స్థిరపడింది. ఈ క్రమంలో పలు సీరియళ్లలో చిన్న చిన్న పాత్రలు చేసింది. అయితే ఓ ముగ్గురు వ్యక్తులు ఆమెను కలిసి సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామని ఆమెతో నమ్మబలికారు. ముంబైలో ఉన్న ఓ స్టార్ డైరెక్టర్ కొత్త వాళ్ల కోసం అన్వేషణ ప్రారంభించాడని.. నేరుగా ఆయనతోనే సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఈ క్రమంలో డిసెంబర్ 25న సరోజినీ నగర్ లోని ఓ అపార్ట్‌మెంట్ కు తీసుకెళ్లి.. ఆ ముగ్గురు ఆమెపై ఈ దారుణానికి తెగబడ్డారు. మరుసటి రోజు యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారిని అరెస్ట్ చేశారు. అయితే కాసేపటికే వారిని విడుదల చేసినట్లు తెలియటంతో సదరు మోడల్‌ ఆందోళనకు సిద్ధమైంది. వారి వల్ల తన ప్రాణాలకు ముప్పువాటిల్లే అవకాశం ఉందని ఆమె భయపడుతోంది. అయితే వారిని బెయిల్ పై విడుదల చేశామని.. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Delhi rape  Model  gang-rape  Sarojini Nagar  rapists  model raped  alcohol rape  crime  

Other Articles