భారత నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ పై భారత గూఢచారి అని ముద్ర వేసి జైలులో బంధీగా వుంచిన తరుణంలో అయనను చూసేందుకు వెళ్లిన అతని భార్య, తల్లిని వితంతువులుగా పాకిస్తాన్ మార్చివేసిందని.. భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ దాయాధి దేశంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొడుకును చూసేందుకు తల్లి, భర్తను చూసేందుకు భార్య వెళ్లగా, వారిని వితంతువులుగా మార్చి విష ప్రచారం చేయడాన్ని కూడా అమె అక్షేఫించారు. పైగా భార్యను బురఖా లాంటి నల్లవస్త్రాలే ధరించాలని అంక్షలు పెట్టడంపై కూడా అమె తీవ్రస్థాయిలో అగ్రహం వ్యక్తం చేశారు.
పార్లమెంటులోని పెద్దల సభ (రాజ్యసభ)లో అమె కుల్ భూషణ్ జాదవ్ విషయమై ప్రకటన చేస్తూ.. జాదవ్ ను కలిసేందుకు ముందు ఆయన భార్య, తల్లి చేత గాజులు తీయించడం, తాళిబొట్టు, బొట్టులను తీయించడం వారు అచరించే సంప్రాదాయాలపై ప్రభావం చూపేలా చేయడం అమానవీయమన్నారు. జాధవ్ తల్లి అవంతితో తాను మాట్లాడినట్లు వెల్లడించారు. తన మెడలో తాళిబోట్టు లేకపోవడంతో అందోళన చెందిన జాదవ్ తొలిమాటగా నాన్న ఎలా ఉన్నారని? అడిగినట్లు చెప్పారు. జాధవ్ భార్యతో కూడా తాను మాట్లాడానని సుష్మా చెప్పారు.
తన బూట్లు తిరిగి ఇవ్వాలని ఎన్నిసార్లు కోరినా పాకిస్తాన్ అధికారులు ఇవ్వలేదని వెల్లడించారు. ఆ బూట్లలో కెమెరా ఉందంటూ పాక్ ప్రకటన చేయడం మరింత నీచానికి దిగజారడమేనని సుష్మా దుయ్యబట్టారు. బూట్లలో ఏదైనా అమె విమానం ఎలా ఎక్కేదని ప్రశ్నించారు. మావవతా దృష్టితో జాధవ్ ను కలవడానికి అంగీకరించామని చెబుతూ పాక్ ఇలాంటి నీచకార్యాలకు పాల్పడటం అమానుషమని ధ్వజమెత్తారు. జాధవ్ కుటుంబసభ్యుల మానవ హక్కులు పాకిస్తాన్ లో పదే పదే ఉల్లంఘనకు గురయ్యాయని చెప్పారు. ఓ భీతావాహ వాతావరణంలో జాధవ్ ను కుటుంబ సభ్యులు కలిశారని ఆవేదన వ్యక్తం చేశారు.
చీర మాత్రమే కట్టుకునే జాధవ్ తల్లితో సాల్వార్ కుర్తా వేయించారని.. మారఠీ మాత్రమే వచ్చిన తల్లి జాదవ్ తో అ బాషలో మాట్లాడనివ్వలేదని తెలిపారు. అమె మరాఠీలో మాట్లాడటంతో ఇంటర్ కామ్ ను పాకిస్తాన్ అధికారులు ఆపివేసినట్లు సుష్మా తెలిపారు. జాధవ్ ను సురక్షితంగా విడిపించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని సుష్మా స్వరాజ్ వెల్లడించారు. అనంతరం కాంగ్రెస్ పక్ష నాయకుడు మల్లిఖార్జున్ ఖార్గే మాట్లాడుతూ జాధవ్ తల్లి, భార్యలతో అమర్యాదగా ప్రవర్తించడాన్ని ప్రతి భారతీయుడితో అమర్యాదగా ప్రవర్తించడంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజకీయ భేధాలతో సంబంధం లేకుండా దేశ ప్రజల పట్ల అగౌరవంగా నడుచుకుంటే సహించబోమని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more